Hyderabad News: హైదరాబాద్‌లోని అంబర్పేట్(Amberpet) పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్‌లో సుమారు రూ.70 నుంచి 80 లక్షలు వరకు నష్టపోయిన ఆయన, అప్పులు తీర్చేందుకు తన సర్వీస్ రివాల్వర్‌ను తాకట్టు పెట్టినట్లు విచారణలో తేలింది.
అలాగే కేసుల విచారణలో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టిన అధికారులు, శనివారం భాను ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు.
రివాల్వర్ పోయిందని చెప్పేందుకు ట్రైన్లో ప్రయాణిస్తున్న సమయంలో తన సర్వీస్ రివాల్వర్ మిస్సైందంటూ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం పోలీసు విభాగంలో కలకలం రేపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: