HPV Vaccine: భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు బాలికలకు ఉచితంగా అందిస్తున్న HPV (Human Papillomavirus) వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) తీవ్రంగా ఖండించింది. ఈ టీకా వల్ల దుష్ప్రభావాలు ఉంటాయనే వార్తల్లో నిజం లేదని, ప్రజలు అపోహలను నమ్మవద్దని అధికారికంగా ప్రకటించింది.
Read Also: TG Oil Palm Price: పెరిగిన ఆయిల్ పామ్ ధరలు.. రైతుల్లో కొత్త ఉత్సాహం

అపోహలు వద్దు..
ఈ వ్యాక్సిన్ కొత్తగా కనిపెట్టినదేమీ కాదని, 2006 నుంచే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని గుర్తు చేసింది. 2022 సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని, అనేక అంతర్జాతీయ అధ్యయనాలు ఈ టీకా భద్రతను, సమర్థతను ధృవీకరించాయని స్పష్టం చేసింది.
గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న తరుణంలో, ఈ వ్యాక్సిన్ ఒక వరమని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా 14 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా అందించడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా 93% నుండి 100% వరకు రక్షణ లభిస్తుందని వైద్య నిపుణుల పరిశోధనల్లో తేలిందని వెల్లడించింది. ఎలాంటి భయం లేకుండా అర్హులైన బాలికలకు వ్యాక్సిన్ వేయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: