కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)(GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మెగా శానిటేషన్ డ్రైవ్ను ప్రారంభించనుంది. డిసెంబర్ 29 నుంచి జనవరి 31 వరకు నెల రోజుల పాటు ఈ విస్తృత కార్యక్రమం కొనసాగుతుంది. దోమల వ్యాప్తిని అరికట్టడం, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించడం ప్రధాన ఉద్దేశంగా ఈ డ్రైవ్‌ను అమలు చేస్తున్నారు. కోట్లాది జనాభాతో నిత్యం కదలాడే హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం అత్యంత కీలక అంశంగా మారింది.
Read also: Ro Khanna: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులపై అమెరికా ఆందోళన

ప్రతి రోజు 300 వార్డుల్లో విస్తృత పారిశుద్ధ్య పనులు
వార్డుల పునర్విభజన తర్వాత చేపట్టనున్న తొలి పెద్ద కార్యక్రమంగా ఈ మెగా శానిటేషన్ డ్రైవ్ నిలుస్తోంది. ప్రతిరోజూ సుమారు 300 వార్డుల్లో శుభ్రత పనులు నిర్వహించనున్నారు. చాలా కాలంగా పేరుకుపోయిన చెత్త, కూల్చివేతల సమయంలో మిగిలిపోయిన వ్యర్థాలు, ఖాళీ ప్రదేశాల్లో నిల్వ ఉన్న మలినాలను పూర్తిగా తొలగించనున్నారు. పార్కులు, ఫుట్‌పాత్‌లు, ప్రజలు అధికంగా తిరిగే ప్రాంతాలు ప్రత్యేకంగా శుభ్రం చేయబడతాయి. చెత్త వేయడానికి అలవాటుపడ్డ ప్రాంతాలను గుర్తించి, అక్కడ మొక్కలు నాటడం, గోడలకు రంగులు వేయడం వంటి సౌందర్య కార్యక్రమాలు కూడా చేపడతారు. దీని ద్వారా నగరానికి శుభ్రతతో పాటు అందం కూడా చేకూరనుంది.
ఆరోగ్య రక్షణతో పాటు నగర సౌందర్యం
ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల మధ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులు వంటి ప్రాంతాల్లో కూడా శుభ్రత పనులు నిర్వహించనున్నారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్త వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ డ్రైవ్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల నగరంలో డెంగ్యూ కేసులు పెరగడం కూడా జీహెచ్‌ఎంసీని(GHMC) ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌ను ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన నగరంగా మార్చడమే కాకుండా, కొత్త ఏడాదిని శుభ్రమైన వాతావరణంతో ప్రారంభించాలనే సంకల్పాన్ని జీహెచ్‌ఎంసీ వెల్లడిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: