అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఫిఫా శాంతి(Fifa Peace) బహుమతిని ప్రకటించింది. 2026లో జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో జరిగిన డ్రా కార్యక్రమంలో ఈ శాంతి బహుమతిని ప్రకటించారు. అక్కడే తొలి శాంతి బహుమతిని ట్రంప్‌నకు ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో ప్రదానం చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్, తన జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవాల్లో ఇది ఒకటి అని పేర్కొన్నారు. ‘ఈ అవార్డు దక్కడం నా జీవితంలో అతిపెద్ద గౌరవం. అవార్డులతో సంబంధం లేకుండా నా దౌత్యంతో లక్షలాది మంది ప్రాణాలను కాపాడా. కాంగో శాంతి ఒప్పందమే అందుకు ఉదాహరణ.
Read Also: PM Modi: రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఈ-వీసా… మోదీ

ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ముగించా: ట్రంప్
మరో 10 మిలియన్ల మంది చావు అంచుల్లో ఉన్నారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టా. ఇది ఎంతో గర్వకారణం. అంతేకాకుండా భారత్-పాకిస్థాన్ అణు యుద్ధాన్ని సైతం నేనే ఆపా. నా దౌత్యంతో ఎన్నో దేశాల మధ్య యద్ధాలు ముగించా. ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయి. కొన్ని ఆలస్యం అవుతాయి. కానీ మేం వాటిని కూడా ముగిస్తాం’ అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అది వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదోకు శాంతి నోబెల్ బహుమతి ప్రకటించింది. దీంతో ఆయన నిరాశకు లోనైయ్యారు.
ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతి
ఫిఫా ఈ ఏడాది నుంచే తొలిసారి శాంతి బహుమతిని ఇవ్వనున్నట్లు నవంబర్ 5న ప్రకటించింది. ఇది ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని తెలిపింది. ఫిఫాకు ఇదొక గుర్తింపుగా పేర్కొంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపన కోసం తీవ్రంగా శ్రమించే వారికి, తన చర్యలతో ప్రపంచాన్ని ఏకం చేసే వారికి ఈ బహుమతిని అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. మరోవైపు ట్రంప్‌నకు ఫిఫా శాంతి బహుమతి ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై హ్యూమన్ రైట్ వాట్ సంస్థ స్పందిస్తూ ఫిఫాపై బహిరంగాంగానే విమర్శలు చేసింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: