తమిళనాడు ప్రభుత్వం ఏడేళ్ల విరామం తర్వాత ఒకేసారి 2016 నుంచి 2022 వరకూ రాష్ట్ర సినీ అవార్డులను ప్రకటించడం తెలిసిందే.. ఈ సందర్బంగా, ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ (Director Pa. Ranjith) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు ప్రభుత్వ అవార్డుల ప్రకటన వెలువడిన వెంటనే ఆయన తన ఎక్స్ ఖాతాలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలు ప్రకటించే సినిమా అవార్డుల్లో నిజాయితీ, పారదర్శకత నిజంగా పాటిస్తున్నారా?… ‘‘అవార్డుల ఎంపిక నిజంగా పారదర్శకంగా జరుగుతుందా?’’
Read Also: Saina Nehwal: పరిణీతి చోప్రా అన్‌ఫాలోపై సైనా రియాక్షన్ ఇదే!
చిత్ర పరిశ్రమలో చర్చ
అంటూ ఆయన వేసిన ప్రశ్న కోలీవుడ్‌లో ఎంతోమంది అభిప్రాయాలకు ప్రతిబింబంగా మారింది.పా. రంజిత్ (Director Pa. Ranjith) తమిళ చిత్ర పరిశ్రమలో సామాజిక అంశాలు, దళిత రాజకీయాలు ప్రధానంగా ప్రతిబింబించే చిత్రాలకు పేరుగాంచిన దర్శక నిర్మాత. 2012లో ‘అట్టకత్తి’తో దర్శకుడిగా పరిచయమైన ఆయన, ‘మద్రాస్’, ‘కబాలి’, ‘కాలా’, ‘సార్పట్ట పరంపర’ వంటి సినిమాలతో తన ఆలోచనా విధానాన్ని చాటుకున్నారు.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘తంగలాన్’తో పా రంజిత్ పేరు మార్మోగిపోయింది. నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సామాజిక స్పృహ కలిగిన చిత్రాలను నిర్మిస్తూ, సినీరంగంలో ఒక బలమైన స్వరంగా కొనసాగుతున్నారాయన. అందుకే అవార్డుల విషయంలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు కేవలం ఒక ట్వీట్‌కే పరిమితం కాకుండా, మొత్తం చిత్ర పరిశ్రమలో చర్చకు దారి తీస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: