हिन्दी | Epaper

Lok Sabha: స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

Vanipushpa
Lok Sabha: స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా(Om Birla)ను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు హస్తం పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-C ప్రకారం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ఉందని చెప్పారు. “ఈరోజు మధ్యాహ్నం 1:14 గంటలకు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు సమర్పించాం. మొత్తం 118 మందికి పైగా ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. ప్రజా సమస్యలు లేవనెత్తే హక్కును పదేపదే నిరాకరిస్తున్నారు” అని ఆయన ఆరోపించారు.

Read Also: Trade Deal: భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

Lok Sabha: స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం
Lok Sabha: స్పీకర్‌ ఓం బిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం

ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం, ఇటీవల జరిగిన పలు సంఘటనలు ఈ నిర్ణయానికి దారితీశాయి. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై జనరల్ నరవణే స్మృతులను ప్రస్తావించేందుకు రాహుల్ ప్రయత్నించినప్పటికీ, స్పీకర్ అనుమతించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా, ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం కూడా పెద్ద వివాదంగా మారింది. తమ రాజ్యాంగ హక్కులను వినియోగించినందుకే ఈ చర్యలు తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

పశ్చిమాసియా సంక్షోభం: తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పశ్చిమాసియా సంక్షోభం: తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

HPV టీకాపై అపోహలు వద్దు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

HPV టీకాపై అపోహలు వద్దు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

యుద్ధం ఎఫెక్ట్: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు

యుద్ధం ఎఫెక్ట్: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు

No image

షియోమి 17 సిరీస్ విడుదల, ఫీచర్లు చూస్తే షాక్

వెలుగుమట్ల పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

వెలుగుమట్ల పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

ట్రంప్ ప్రకటన సంచలనం, ఖమేనీ మరణంపై కలకలం

ట్రంప్ ప్రకటన సంచలనం, ఖమేనీ మరణంపై కలకలం

ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి గుర్తింపు

VOCPAతో టాటా మోటార్స్ చారిత్రాత్మక ఒప్పందం

VOCPAతో టాటా మోటార్స్ చారిత్రాత్మక ఒప్పందం

‘కేరళ స్టోరీ-2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్

‘కేరళ స్టోరీ-2’ విడుదలకు గ్రీన్ సిగ్నల్

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది డజన్ల కొద్దీ ఎలిఫెంట్ సీల్స్ పిల్లలు మృతి

📢 For Advertisement Booking: 98481 12870