రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన ముగిసిన నేపథ్యంలో మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ ట్రంప్(Trump) వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. వ్లాదిమిర్ పుతిన్‌కు భారత్ ఇచ్చిన గౌరవాలు మరెక్కడా దక్కవని పేర్కొన్న మైఖేల్ రూబిన్.. భారత్, రష్యాలను దగ్గర చేసినందకు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని తాను వాదిస్తానని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల, భారత్ పట్ల అనుసరించిన విధానంపై భారత్‌లో ఉన్న అసంతృప్తి కారణంగానే ఇరు దేశాలు(భారత్-రష్యా) మరింత దగ్గరయ్యాయని ఆయన ప్రశ్నించారు.
Read Also: America: హెచ్-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

65 శాతం మంది ట్రంప్‌ను ఇష్టపడరు: మైఖేల్ రూబిన్
‘అమెరికన్లలో 65 శాతం మంది ట్రంప్‌ను ఇష్టపడరు. ఆయన విధానాలను వ్యతిరేకించేవారు, భారత్-రష్యా స్నేహాన్ని ట్రంప్ అసమర్థత ఫలితంగా చూస్తారు’ అని మైఖేల్ రూబిన్ ఆరోపించారు. భారత్‌కు హితబోధ ఆపాలి రష్యా నుంచి ఇంధన సరఫరాపై ఇండియాను అమెరికా తప్పుబట్టడంపై కూడా మైఖేల్ రూబిన్ వ్యంగ్యంగా స్పందించారు. భారత ప్రజలు తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి మోదీని ఎన్నుకున్నారని రూబిన్ అన్నారు.
భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతీశారు
ప్రత్యామ్నాయాలు పరిమితంగా ఉన్నప్పుడు అమెరికా కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తుందనే విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. అమెరికా వైఖరి కపటత్వంతో కూడి ఉందని అన్నారు. “భారత్‌కు అవసరమైన పరిమాణంలో, చౌక ధరకు ఇంధనాన్ని అందించడానికి మా దగ్గర సమాధానం లేకపోతే, మేము కేవలం నోరు మూసుకోవడం ఉత్తమ మార్గం, ఎందుకంటే భారత్ ముందుగా దాని భద్రత గురించి ఆలోచించాలి” అని రూబిన్ సూచించారు. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతీశారు.. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను ట్రంప్ అణగదొక్కారని వాషింగ్టన్‌లోని చాలా మంది ఆశ్చర్యపోయారని మైఖేల్ రూబిన్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: