Chiranjeevi Movie: ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి థియేటర్ల వద్ద వసూళ్ల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. వెండితెరపై మెగా మేజిక్‌ను పండించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై అధికారికంగా స్పష్టత రావడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Read Also: Prabhas: మళ్లీ మారుతీతో రెబెల్ స్టార్ సినిమా.. ప్రభాస్ పీఆర్ టీమ్ క్లారిటీ

ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee5) భారీ ధరకు దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయాలని సంస్థ నిర్ణయించింది. కేవలం తెలుగులోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
సినిమా ప్రత్యేకతలు
మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలి నటనతో ఆకట్టుకోగా, ఈ చిత్రానికి అగ్ర కథానాయిక నయనతార తన నటనతో సినిమాకు వెయిట్ పెంచగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియో రోల్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. భీమ్స్ అందించిన మాస్ అండ్ ఎమోషనల్ సాంగ్స్ థియేటర్లలో మోత మోగించాయి. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే మెగా ఫ్యాన్స్ ఫిబ్రవరి 11 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: