BSE NSE budget day trading : కేంద్ర బడ్జెట్ 2026-27 నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బడ్జెట్ ప్రకటన జరిగే ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ, ఆ రోజున కూడా సాధారణంగా ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు Bombay Stock Exchange (బీఎస్ఈ), National Stock Exchange (ఎన్ఎస్ఈ) ప్రకటించాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ప్రత్యేక సర్క్యులర్లు విడుదల చేశాయి.
ఎన్ఎస్ఈ సర్క్యులర్ ప్రకారం, ఫిబ్రవరి 1న ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు యథావిధిగా ట్రేడింగ్ జరుగుతుంది. ఈక్విటీ సెగ్మెంట్‌తో పాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O), కమోడిటీ డెరివేటివ్స్ విభాగాల్లో కూడా లావాదేవీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే, టి+0 సెటిల్‌మెంట్ సెషన్, ఆక్షన్ సెషన్ ఆ రోజు ఉండవని బీఎస్ఈ పేర్కొంది.
Talasani : తలసానిపై కేసు.. వివాదం ఏంటి?
సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ, బడ్జెట్ వంటి కీలక పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేక (BSE NSE budget day trading) ఏర్పాట్లు చేశారు. 2000 సంవత్సరం తర్వాత ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో 2015, 2025 బడ్జెట్‌లు శనివారాల్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా మార్కెట్లు తెరిచే ఉంచారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు రెండు విడతలుగా కొనసాగనున్నాయని తెలిపారు. జనవరి 30న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆర్థిక మంత్రి Nirmala Sitharaman ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: