हिन्दी | Epaper

MLC Anantha Babu : ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్

Sudheer
MLC Anantha Babu : ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండవ నిందితురాలుగా (A2) ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లోతుగా విచారణ జరిపి, హత్యలో ఆమె ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. బుధవారం కోర్టులో సిట్ దాఖలు చేసిన అదనపు అభియోగపత్రం ఆధారంగా న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆమె హాజరుకాకపోవడంతో, తాజా వారెంట్ నేపథ్యంలో పోలీసులు లక్ష్మీదుర్గ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Read Also : Mamata Banerjee news : బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ లోపం? ముర్ము అసహనం

సిట్ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, సుబ్రమణ్యం హత్యకు ప్రేరేపించడమే కాకుండా, హత్య జరిగిన సమయంలో లక్ష్మీదుర్గ ఘటనాస్థలిలోనే ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించిన వాహనంలోనూ ఆమె ఉన్నారని, సాక్ష్యాధారాలను మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. 2022లో జరిగిన ఈ ఘటనపై టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధిత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సిట్ ఏర్పాటు కావడం, తాజాగా ఆమెను ఏ2గా చేర్చడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఇప్పటికే ప్రధాన నిందితుడైన అనంతబాబు బెయిల్‌పై బయట ఉండగా, ఇప్పుడు ఆయన భార్య చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870