हिन्दी | Epaper

Balka Suman: కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

Saritha
Balka Suman: కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్
Balka Suman: Balka Suman meets KCR

Balka Suman: భారత రాష్ట్ర సమితి అధినేత, కేసీఆర్‌ను (KCR) చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన బాల్క సుమన్, విడుదలైన అనంతరం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో జరిగిన పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై ఇరువురు చర్చించారు.

Read Also: Telangana: ప్రగతి ఫలాలు అందించడమే మా లక్ష్యం మంత్రి సీతక్క

ఎన్నికల్లో దైర్యంగా పనిచేసి మెజారిటీ సభ్యులను గెలిపించుకున్నందుకు, కాంగ్రెస్ దౌర్జన్యాలను తిప్పికొట్టినందుకు కేసీఆర్ బాల్క సుమన్‌ను అభినందించారు. ప్రభుత్వ వేధింపులకు భయపడకుండా పార్టీ జెండాను రెపరెపలాడించారని కొనియాడారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి విజయం సాధించడం అభినందనీయమని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు మూడు వారాల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బాల్క సుమన్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870