- రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు
విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్బంధ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్(AP) రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్లో రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్ల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం నాయకుడు అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టడం ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం పనితీరుకు అద్దం పడుతుందన్నారు.
Read also: Machilipatnam Municipality: కోర్టు ఆదేశాలంటే నవ్వులాటలా?

అప్పలరాజుపై 19 కేసులు ప్రజా సమస్యలపై పనిచేసిన సమయంలో పెట్టినవేనన్నారు. అనకాపల్లిలో మిట్టల్ ఐరన్ కంపెనీ, బల్క్ డ్రగ్ కంపెనీకి రైతులు భూములు కట్టబెట్టడాన్ని తాను, అప్పలరాజు, పలు రైతు సంఘాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. హోమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఆమెకు ఎదురైన నిరసన సెగ తట్టుకోలేక, కార్పొరేట్లకు రైతుల భూములు కట్టబెట్టేందుకు, వారి మెప్పు పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సంఘం నాయకుడు అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టారని విమర్శించారు. ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ నాయకులపై రౌడీ షీట్లు సీనియర్ తెరిచారన్నారు.. ఈ కేసులతో పోరాటాలు, ఉద్యమాలు చేసే వారిని బెదిరించాలని ప్రభుత్వం చూస్తోందని తెలిపారు.
ఈ నెల 16న దేశవ్యాప్తంగా ఆందోళనల్లో భాగంగా మండల కేంద్రాల్లో నిరసన తెలియజేయాలన్నారు. రైతు సంఘం(AP) నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ.. విబి జి ఆర్ఎం జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ఛైర్మన్ కామన ప్రభాకరరావు మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు అనుకూల చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని చెప్పారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెవివి ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిర్బంధానికి వ్యతిరేకంగా 12న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని కోరారు. 14నచట్టాల జీవోలను భోగి మంటల్లో దగ్ధంచేస్తామన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: