ఏపీ ప్రభుత్వం(AP Government) డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాల కోసం రివాల్వింగ్ ఫండ్ ప్రకటిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో కొత్త సంఘాలకు మొత్తం 3 కోట్లు రూపాయల ఫండ్ అందించనుంది. ఈ ఫండ్‌ను సంఘ సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘాలు ఈ నిధులను ఉపయోగించి తమ ఉత్పత్తుల కోసం బ్యాంకు(Bank)ల నుండి పెద్ద మొత్తంలో రుణాలు సులభంగా పొందగలుగుతాయి.
Read Also: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి

రూ. 15,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్
ప్రతీ కొత్త డ్వాక్రా సంఘానికి రూ. 15,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్ కేటాయించబడనుంది. ఈ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకొని, సభ్యుల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ నిధులను త్వరలోనే సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లాల అధికారులకు సంఘాల జాబితా అందజేస్తూ, తదుపరి చర్యలకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశారు.
డ్వాక్రా సంఘాలకు మద్దతు
కూటమి ప్రభుత్వం, మహిళలు తమ ఉత్పత్తులను మరింత పెంచేలా డ్వాక్రా సంఘాలకు మద్దతు అందించే విధంగా నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకర్ల సమావేశాల్లో కొత్తగా ఏర్పాటైన సంఘలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. రుణాల తిరిగి చెల్లింపు క్రమం సక్రమంగా ఉండటంతో, బ్యాంకులు కూడా కొత్త రుణాలుగా ముందుకు వస్తున్నాయి.
అదేవిధంగా, డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రొమోషన్ విషయంలో ప్రభుత్వం కొత్త మార్గాలను రూపొందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా మహిళలు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: