కన్నడ నటి రమ్య (Divya Spandana) కు జంతువుల తరఫున గళమెత్తడం కొత్తేం కాదు. గత ఏడాది జూలైలో సుప్రీంకోర్టు వీధి కుక్కల అంశంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సూచించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రమ్యా (Ramya) తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కుక్కల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు,
Read Also: Dhurandhar Movie Ban: గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్.. కేంద్రానికి లేఖ

నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
వీధి కుక్కలను వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. “ఈ కుక్క కాటేస్తుంది, ఈ కుక్క కాటేయదు అని ముందుగా తెలుసుకోవడం అసాధ్యం. వీధి కుక్కల మూడ్ ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు” అంటూ, అందుకే అన్ని కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.’మగాళ్ల మైండు కూడా చదవలేం. వాళ్లు ఎప్పుడు అత్యాచారం/మర్డర్ చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని (Ramya) ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: