కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్..

కిరణ్ రాయల్ పై ఆరోపణలు లక్ష్మి అరెస్ట్..

తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ తనను రూ.1.20 కోట్ల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. మరోవైపు సదరు మహిళతో కిరణ్ రాయల్ ప్రైవేటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పార్టీకి దూరంగా ఉంచింది. నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ముగించుకుని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆన్ లైన్ చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

kiran royal 1

లక్ష్మిరెడ్డిని రాజస్ధాన్​కు చెందిన జైపూర్ పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రెస్‍ క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్‍ రాయల్‍పై విమర్శలు చేసి తిరిగి వెళ్తున్న లక్ష్మిరెడ్డిని రాజస్ధాన్‍ నుంచి వచ్చిన మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.లక్ష్మిరెడ్డిని తిరుపతి ఎస్వీయూ పోలీస్‍ స్టేషన్‍కు తరలించారు. స్ధానిక పోలీసులకు సమాచారం అందించిన తర్వాత ట్రాన్సిట్‍ వారెంట్‍తో జైపూర్​కు తరలించనున్నారు. ఆన్​లైన్​ గేమ్స్​లో చీటింగ్ చేయడంతో లక్ష్మిరెడ్డిని రాజస్ధాన్‍ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‍పీసీ 173 సెక్షన్‍ కింద కేసు నమోదు చేశారు.ఆన్ లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నట్టు సమాచారం. పోలీసుల ప్రకారం, లక్ష్మి చేసిన ఆరోపణల్లో చాలావరకు నిరాధారమైనవిగా తేలాయి. కిరణ్ రాయల్ ఫిర్యాదు మేరకు పోలీసులు లక్ష్మిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో లక్ష్మి ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోవడంతో ఆమెను తప్పుడు ఆరోపణలు, కిరణ్ రాయల్ పరువు నష్టం వంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తూ ఉండడంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేసి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి కిరణ్ రాయల్ పై ధ్వజమెత్తింది. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని… తనకు ఎవరూ తెలియదని చెప్పింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ తన పరిస్థితి పట్ల స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరింది.

Related Posts
రెండు నెలల గడువు కోరిన వర్మ
ఇవాళ వర్మ సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ వర్మ విచారణను డుమ్మా కొట్టారు.

సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు: టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కూటమి సర్కార్ నమోదు చేసిన ఓ కేసులో ఇవాళ ఆయన సీఐడీకి ఝలక్ ఇచ్చారు. గుంటూరు Read more

Marri Rajasekhar: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక
Marri Rajasekhar: వైసీపీకి గుడ్‌బై - టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు అడుగులు Read more

ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం-కేంద్రం అఫిడవిట్‌పై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఊహించని తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. బస్సు ఢీ కొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందడంతో.. ఆమె కుటుంబ సభ్యులకు Read more

ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండండి : కేటీఆర్..!
KTR

హైదరాబాద్‌: ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సోమవారం ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని Read more