Kunal Kamra granted anticipatory bail

Kunal Kamra: కుణాల్‌ కామ్రాకు ముందస్తు బెయిల్‌ మంజూరు

Kunal Kamra: మద్రాస్‌ హైకోర్టు స్టాండప్‌ కమెడియన్‌ కుణాల్‌ కామ్రాకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే పై ఇటీవల కుణాల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్‌ 7వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కుణాల్‌ తన షోలో ప్రత్యేకంగా ఎవరినీ ప్రస్తావించలేదని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ కుణాల్‌ తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

 కుణాల్‌ కామ్రాకు ముందస్తు బెయిల్‌

వాక్‌ స్వాతంత్ర్యానికీ, వ్యంగ్యానికీ ఓ హద్దు

ఇటీవల ముంబయిలో కుణాల్‌ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏక్‌నాథ్‌ శిందేపై ఓ పేరడీ పాటను ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు దాడి చేసి కార్యక్రమం వేదికను ధ్వంసం చేశారు. దీనిపై ఇటీవల స్పందించిన ఏక్‌నాథ్‌ శిందే.. కామ్రా వ్యాఖ్యలు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ‘సుపారీ’ తీసుకున్నట్లు ఉన్నాయన్నారు. వాక్‌ స్వాతంత్ర్యానికీ, వ్యంగ్యానికీ ఓ హద్దు ఉంటుందని పేర్కొన్నారు.

Related Posts
నేటి నుంచి మేరీ మాత ఉత్సవాలు
gunadala mary matha

విజయవాడ గుణదల కొండపై ప్రారంభమయ్యే మేరీ మాత ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. 1923లో ఇటలీకి చెందిన ఫాదర్ ఆర్లాటి గుణదల కొండపై మేరీ మాత విగ్రహాన్ని Read more

అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ
amith shah

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుండటంతో… దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేశ రాజధానిలో జెండా ఎగురవేయాలనే బీజేపీ Read more

Sajjanar: బెట్టింగ్ యాప్ బాధితులకు సజ్జనార్ విజ్ఞప్తి
Sajjanar appeals to betting app victims

Sajjanar: ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ, క్రికెట్ సెలెబ్రెటీస్, యూట్యూబ్ స్టార్స్ చేసిన బెట్టింగ్ Read more

Pradeep Purohit :మోదీ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రదీప్ పురోహిత్
Pradeep Purohit :మోదీ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రదీప్ పురోహిత్

బీజేపీ సీనియర్ నేత,బార్ గఢ్ ఎంపీ, లోక్‌సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ పునర్జన్మ రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *