Myanmar earthquake..Death toll crosses 100

Earthquake: మయన్మార్‌ భూకంపం .. 100 దాటిన మృతుల సంఖ్య

Earthquake: మయన్మార్‌ భారీ భూకంపం ధాటికి విలవిల్లాడుతోంది. వరుస భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ 103 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరోవైపు, థాయ్‌లాండ్‌లో నలుగురు మృతిచెందగా.. 50 మంది గాయపడినట్లు సమాచారం. అలాగే, చైనాలోనూ పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Advertisements
image
image

ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతు

మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్‌ వంతెన, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. బ్యాంకాక్‌లోని నిర్మాణంలో ఉన్న ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతైనట్లు థాయ్‌లాండ్‌ రక్షణ మంత్రి ప్రకటించారు. శుక్రవారం రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి మయన్మార్‌, థాయ్‌లాండ్‌లోని పలు భవంతులు కుప్పకూలిపోయాయి. మయన్మార్‌ రాజధాని నగరం నేపిడాలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు

బ్యాంకాక్‌లో భూప్రకంపనలతో ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లోని నీరు కిందకు పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు.

Related Posts
America: అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన
అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు సోమవారం డాలస్‌లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్‌ అధికారులు Read more

YS Jagan: కూటమిపై జగన్ హెక్కుపెట్టిన విమర్శలు
కూటమిపై జగన్ హెక్కుపెట్టిన విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో అరటి తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం మాజీ Read more

Donald Trump: ఆకట్టుకుంటున్న ఏఐ రైతులా ట్రంప్..వీడియో వైరల్
ఆకట్టుకుంటున్న ఏఐ రైతులా ట్రంప్..వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ రైతుగా ఉంటే ఎలా ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అగ్రరాజ్య Read more

ఒహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి
ఒహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి

వైట్ హౌస్‌లో కొత్త ప్రభుత్వ సామర్థ్య కార్యాలయానికి నాయకత్వం వహించడానికి ఎంపికైన వివేక్ రామస్వామి, ఇప్పుడు ఒహియో గవర్నర్ పదవికి పోటీ చేయడానికి వారు సిద్ధమవుతున్నారు. అందుకే, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×