బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని కలలు కంటున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ 200 మందిని వెంటబెట్టుకొని డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ అధికారంలో లేక పదెనిమిది నెలలే అవుతోందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో అనుమానాలు కలిగించేందుకు బీఆర్ఎస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

వ్యతిరేక ప్రచారంపై అసహనం
రేవంత్ రెడ్డిపై చేస్తున్న ప్రచారం విఫలమవడంతో కేసీఆర్ కుటుంబం భరించలేకపోతోందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఏదో చేస్తామని కేటీఆర్ చెబుతున్నారని, కానీ పదేళ్ల పాలనలో చేసినది ఏమిటని ప్రశ్నించారు.కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన 70 హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
కుటుంబ సభ్యుల ఫోన్లను కేటీఆర్ తప్ప ఎవరూ ట్యాప్ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా బీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి ఎక్కువ చేస్తూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డిని తిట్టడం ద్వారా బీఆర్ఎస్ నేతలు పాపులారిటీ సంపాదించాలనుకుంటున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
Read Also : Chirag Paswan : నితీశ్ పాలనపై చిరాగ్ పాశ్వాన్ ఘాటు విమర్శలు