IPL 2025 :సీఎస్‌కే పై కోల్‌కతా భారీ విజయం

IPL 2025 :సీఎస్‌కే పై కోల్‌కతా భారీ విజయం

ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుకు 2025 సీజన్ ఆశించినంతగా సాగడం లేదు. సారథి మారినా ఆ జట్టు రాత మారలేదు. రుతురాజ్‌ గాయపడటంతో దిగ్గజ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా,చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌ వైఫల్యంతో మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులకే పరిమితమైంది. అందరూ విఫలమైనా గుడ్డిలో మెల్లలా శివమ్‌ దూబె (29 బంతుల్లో 31 నాటౌట్‌, 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సునీల్‌ నరైన్‌ (3/13) బంతితో పాటు బ్యాట్‌ (18 బంతుల్లో 44, 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తోనూ రాణించి కేకేఆర్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేదనను కోల్‌కతా 10.1 ఓవర్లలోనే దంచేసింది. ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది మూడో విజయం కాగా చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి.

Advertisements

బ్యాటింగ్‌ ఆర్డర్‌

 ప్రత్యర్థి జట్లన్నీ పవర్‌ ప్లేలో వీరబాదుడు బాదుతూ వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబడుతుంటే చెన్నై ఆటతీరు మాత్రం నానాటికీ తీసికట్టుగా మారుతుందనడానికి ఈ స్కోరే నిదర్శనం. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్న రచిన్‌ (4) మళ్లీ నిరాశపరచగా కాన్వే (12), రుతురాజ్‌ స్థానంలో వచ్చిన త్రిపాఠి (16) అతడినే అనుసరించారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ పొందిన విజయ్‌ శంకర్‌ (29) నిలదొక్కుకున్నట్టే కనిపించినా స్పిన్నర్ల రాకతో అతడూ నిష్క్రమించాడు. కోల్‌కతా స్పిన్నర్ల ధాటికి చెన్నై మిడిలార్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. అశ్విన్‌ (1) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవగా జడేజా, దీపక్‌ హుడా డకౌట్‌ అయ్యారు. చెన్నై భారీ ఆశలు పెట్టుకున్న సారథి ధోనీ (1) కూడా ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేరాడు. దూబె ఆఖరిదాకా క్రీజులో నిలిచినా అతడూ బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. ఐపీఎల్‌లో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోరు కాగా చెపాక్‌లో ఇదే మొదటిది. నరైన్‌తో పాటు కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి (2/22), హర్షిత్‌ రాణా (2/16) పొదుపుగా బౌలింగ్‌ చేసి చెన్నైని కట్టడిచేశారు.

భారీ సిక్సర్‌

నెట్‌ రన్‌రేట్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ తొలి ఓవర్‌ నుంచే దూకుడుగా ఆడింది. ఖలీల్‌ తొలి ఓవర్లో డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌తో ఛేదన మొదలెట్టిన నరైన్‌.. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. డికాక్‌ (23) మూడు సిక్సర్లు కొట్టి ఊపుమీదే కనిపించినా తక్కువ స్కోరుకే నిష్క్రమించాడు. కానీ రహానే అండతో నరైన్‌ రెచ్చిపోయాడు. ఖలీల్‌ 6వ ఓవర్లో 6, 4తో రెచ్చిపోయాడు. రహానే, రింకూ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.

రాజస్థాన్​తో మ్యాచ్​లో మోచేతి గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సీఎస్కే కెప్టెన్‌గా ధోని తిరిగి బాధ్యతలు స్వీకరించాడు. ‘‘మాకు ఓ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ ఉన్నాడు.పేరు ధోని. మిగిలిన ఐపీఎల్‌కు అతడు చెన్నై కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు’’ అని శుక్రవారం కేకేఆర్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ చెప్పాడు. ధోని ఇంతకుముందు 2008 నుంచి 2023 వరకు సారథిగా చెన్నైని నడిపించి, జట్టుకు అయిదు టైటిళ్లు అందించాడు. 2024 సీజన్‌కు ముందు రుతురాజ్‌కు బాధ్యతలు అప్పగించాడు.

Read Also: IPL 2025 :గుజరాత్ జట్టును వీడిన గ్లెన్ ఫిలిప్స్

Related Posts
జమిలి జేపీసీలో ప్రియాంకాగాంధీ?
priyanka

‘వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ Read more

సుంకాలు తగ్గించేందుకు భారత్ సుముఖం: ట్రంప్
కొత్త ఎలక్ట్రానిక్స్ సుంకాలు: తాత్కాలిక మినహాయింపులు

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడానికి భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికన్ ఉత్పత్తులపై అత్యధికంగా సుంకాలు వేసే దేశంగా భారత్‌ను అభివర్ణించే ట్రంప్.. Read more

AAPపై ‘ఛార్జ్ షీట్’ విడుదల చేసిన బిజెపి
anurag thakur

AAPపై 'ఛార్జ్ షీట్' విడుదల చేసిన బిజెపి: ఢిల్లీలో అత్యధిక అవినీతి మంత్రులు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలో నివసించే ప్రజలకు బూటకపు వాగ్దానాలు Read more

మెట్రో ప్రయాణికుల పై ఛార్జీల భారం
bengaluru metro

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి, దీంతో రోజువారీ ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. కొత్త టికెట్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానుండగా, కనిష్ఠ ఛార్జీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×