IPL2025: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

IPL 2025: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

​ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతోంది. టాస్‌లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే గెలిచి, ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించారు.ఈ సీజన్‌లో ఇరు జట్లు సరిసమానంగా ఉన్నాయి. నాలుగు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రెండు జట్లు కూడా రెండ్రెండు విజయాలను సొంతం చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఐదులో ఉండగా, లక్నో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Advertisements

డకౌట్

ఈ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్ మొత్తం మీద కూడా కలిపి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 15 పరుగులు చేయగా, ఢిల్లీపై డకౌట్ అయ్యాడు. పంజాబ్‌పై రెండు, ముంబైపై రెండు పరుగులు మాత్రమే చేశాడు.ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రోజు కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో అయినా కమ్ బ్యాక్ ఇవ్వాలని పంత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మరో పది మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌తో కమ్ బ్యాక్ ఇచ్చి పాత పంత్ బయటకు రావాలని లక్నో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విజయం

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఐదు మ్యాచ్‌లు ఆడాయి. అందులో లక్నోదే పైచేయిగా ఉంది. కేకేఆర్ కేవలం రెండు మ్యాచ్‌లు గెలవగా, లక్నో మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ రెండు జట్లు చివరగా ఆడిన మ్యాచ్‌లో మాత్రం కేకేఆర్ 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

 IPL 2025: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు

క్వింటన్ డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రసెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు

ఎయిడెన్ మర్కరమ్, మిచ్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్థూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్.

Read Also: Rajat Patidar: రజత్ పాటిదార్ కు రూ.12 లక్షల జరిమానా

Related Posts
నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలి
mumbai boat accident

ముంబై తీరంలో జరిగిన దారుణ బోటు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కలచివేస్తోంది. నీల్కమల్ ఫెర్రీ బోటు ప్రమాదానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే అని Read more

అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి.. బంగ్లాదేశ్‌పై భారత్‌ రికార్డు విజయం
nitish2.jpg

తెలుగు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రదర్శనతో భారత జట్టును విజయపథంలో నిలిపాడు. ఢిల్లీలో బుధవారం రాత్రి జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో Read more

తాగి వస్తే పనిష్మెంట్ గా మటన్ భోజనం
మద్యం తాగితే ఊరికో విందు భోజనం – వినూత్న నిబంధన అమలు చేస్తున్న గ్రామం

భారతదేశంలో మద్యపానంపై ఎన్నో చట్టాలు, నిషేధాలు ఉన్నా, వాటిని అమలు చేయడం ఎంతో కష్టమైన పని. అయితే, గుజరాత్‌లోని ఖతిసితర గ్రామస్తులు తమదైన పద్ధతిలో మద్యం వ్యసనాన్ని Read more

భారత్‌లో చైనా వైరస్‌ తొలి కేసు
భారత్‌లో చైనా వైరస్‌ తొలి కేసు

బెంగుళూరులో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదు. బెంగళూరులో ఎనిమిది నెలల శిశువుకు హ్యూమన్ మెటాప్యూమోవైరస్ (హెచ్ఎమ్పివి) వైరస్ ఉన్నట్లు గుర్తించారు. నివేదికల ప్రకారం, ఆ బిడ్డకు ఎటువంటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×