हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Suresh Raina: కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికి తప్పు చేశాడు: సురేష్ రైనా

Anusha
Suresh Raina: కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికి తప్పు చేశాడు: సురేష్ రైనా

ఐపీఎల్ 2025లో భాగంగా,  గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో హోరాహోరీగా జరిగిన హైస్కోరింగ్‌ థ్రిల్లర్‌లో బెంగళూరు ప్రత్యర్థిని 11 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ప్రత్యర్థులను వారి సొంతగడ్డపై మట్టికరిపిస్తున్న బెంగళూరు చిన్నస్వామిలో హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది.206 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్‌ 194/9 వద్దే ఆగిపోయింది. యశస్వి జైస్వాల్‌ (19 బంతుల్లో 49, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ధ్రువ్‌ జురెల్‌ (34 బంతుల్లో 47, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ రాజస్థాన్‌కు మరో అపజయం తప్పలేదు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు విరాట్‌ కోహ్లీ (42 బంతుల్లో 70, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 50, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.

బౌలర్లపై

సొంతగడ్డపై ఆడిన గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్‌ మెరుగైంది. దూకుడు మీదున్న ఓపెనింగ్‌ ద్వయం ఫిల్‌ సాల్ట్‌ (26), కోహ్లీ ఆరంభం నుంచే రాజస్థాన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ 6.4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించి బెంగళూరుకు శుభారంభం అందించారు. ఆర్చర్‌ మొదటి ఓవర్‌లో కోహ్లీ బౌండరీతో పరుగుల వేటకు శ్రీకారం చుట్టి అతడే వేసిన మూడో ఓవర్లోనూ ఫైన్‌లెగ్‌, స్కేర్‌ లెగ్‌ దిశగా ఫోర్లు కొట్టాడు.తుషార్‌ 5వ ఓవర్లో సాల్ట్‌ రెండు బౌండరీలు రాబట్టాడు. పవర్‌ ప్లే తర్వాత బంతినందుకున్న హసరంగ తన తొలి ఓవర్‌లోనే సాల్ట్‌ను ఔట్‌ చేయడంతో బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. సాల్ట్‌ నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లీ బెంగళూరు ఇన్నింగ్స్‌ను నడిపించాడు.ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సురేశ్ రైనా కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికే విషయంలో విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు. అతను 2026 టీ20 ప్రపంచకప్ వరకు ఆడాల్సిందది. అతను ఆడుతున్న తీరు బ్యాటింగ్ రిథమ్ ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన తీరును బట్టే ఈ మాట చెబుతున్నా. ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తున్న తీరు కూడా అతను పీక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.’అని సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.

బ్రాడ్‌కాస్టర్‌

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. సౌతాఫ్రికాతో ఫైనల్ ముగిసిన వెంటనే బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కోహ్లీని అనుసరించారు. అదే రోజు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం వన్డే, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నారు.ఐపీఎల్ 2025 సీజన్‌లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 65.33 సగటు, 144.12 స్ట్రైక్‌రేట్‌తో 392 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్(417) అగ్రస్థానంలో నిలిచాడు.

Read Also: Suresh Raina: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కు ఫిధా అయిన సురేష్ రైనా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870