టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ విరాట్ కోహ్లీతో తన సంభాషణను గుర్తు చేసుకుంది. తన తండ్రితో పాటు విరాట్ కోహ్లీ దగ్గర శిక్షణ పొందానని చెప్పింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ అనయ బంగర్(Anaya Bangar)కు బ్యాటింగ్ చిట్కాలు కూడా ఇచ్చినట్లు తాను చెప్పుకొచ్చింది. గతేడాది తన హార్మోన్ల మార్పుల కారణంగా వార్తల్లో నిలిచిన అనయ బంగర్ విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్నానని కోహ్లీ తన బలాలపై దృష్టి పెట్టమని ప్రోత్సహించినట్లు చెప్పింది.అనయ బంగర్ మాట్లాడుతూ “నేను విరాట్ కోహ్లీని చాలా సార్లు కలిశాను. విరాట్ కోహ్లీ దగ్గర శిక్షణ కూడా పొందాడు. కోహ్లీ నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. నేను బ్యాటింగ్ చేయడం చూశాడు. కోహ్లీ బ్యాటింగ్ చేయడాన్ని దగ్గరగా చూసే అవకాశం నాకు లభించింది” అంటూ అనయ బంగర్ చెప్పుకొచ్చింది.మ్యాచ్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని విరాట్(Virat Kohli) ను ఒకసారి అడిసారి అడిగినట్లు అనయ బంగర్ తెలిపింది. తమ సొంత బలాలను పూర్తిగా అర్థం చేసుకుని నమ్మేస్థాయి వరకు ప్రాక్టీస్ చేస్తామని విరాట్ కోహ్లీ తనకు చెప్పారని ఆమె వెల్లడించింది. మైదానంల తాము ఏం చేయగలరో వారికి తెలుసన్నారు. వారు దానిని నమ్ముతారని అనయ బంగర్ పేర్కొంది.
టెస్ట్ కెరీర్
అనయ బంగర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె క్రికెట్ ఆడుతున్నట్లు కనిపించింది. ఆమె ఫ్రంట్ ఫుట్ ఆడుతున్నట్లు కనిపించింది. ఆ క్లిప్‌కు క్యాప్షన్ ఇస్తూ ఆమె ఇలా రాసుకొచ్చింది.”నా వద్ద నుంచి ఏదో పెద్ద విషయం రాబోతోందని మీకు తెలియజేస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది. విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి.సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ సక్సెస్‌ఫుల్ టీమిండియా కెప్టెన్. అతని సారథ్యంలో 68 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 40 మ్యాచ్‌లు గెలిచింది. 2016-19 మధ్య కాలంలో కోహ్లీ పరుగుల మోత మోగించాడు. ఈ మూడేళ్లలో అతను 43 టెస్ట్‌ల్లో 66.79 సగటుతో 4,208 రన్స్ చేశాడు. ఆడిన 69 ఇన్నింగ్స్‌లో 16 శతకాలతో పాటు 10 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ కాలంలోనే కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడు.
Read Also : Sunil Gavaskar : సునీల్ గవాస్కర్‌కు బీసీసీఐ లో ప్రత్యేక బోర్డ్ రూమ్