ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన, ఛాతీ నొప్పితో బాధపడుతూ హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి లో చేరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా, ఆయన ఆరోగ్యంపై వైసీపీ శ్రేణులు, అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చికిత్స
కొడాలి నాని గతంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో, తాజా గా ఆయన అస్వస్థత కు గురయ్యారు. గుండె సమస్య కారణంగా ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందా, లేక గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వచ్చిందా అనే దానిపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైసీపీ శ్రేణుల్లో ఆందోళన
కొడాలి నాని ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే, వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు టెన్షన్‌కు గురయ్యారు.ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియకపోవడంతో, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అధికారిక ప్రకటన
అసలు కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు ఏం చెబుతారు? అనేది ఆసక్తికరంగా మారింది. వైద్య పరీక్షల అనంతరం, ఆసుపత్రి వర్గాలు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.కొడాలి నానికి గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో, ఇప్పుడీ ఛాతీ నొప్పి గుండె సమస్య కారణంగా వచ్చిందా? లేక సాధారణ అస్వస్థత మాత్రమేనా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
హైదరాబాద్ లో నివాసం
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న కొడాలి నాని ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.హార్ట్ అటాక్ గుండెకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు జరిగే ప్రాణాంతకమైన పరిస్థితి. ఇది సాధారణంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యల వల్ల కలుగుతుంది.