हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

This Is Our Land : మానేల.. మాఊరు

Abhinav
This Is Our Land : మానేల.. మాఊరు

అరవై గజాల ఇంటి కై అ ఇరవై జిల్లాల్లో పేదలు. ప్రభుత్వాధికార్లతో పోలీ సుల్తో, రాజకీయ నేతల పెంపుడు గుండాలతో ఒకే సమయంలో హోరా హోరీగా కలబడి నిలబడి పోరాటం చేస్తున్న టి.వి. దృశ్యాన్ని నెహ్రూ బస్ స్టేషన్లో చూస్తున్నారు సలీం, శ్యామ్, శర్మలు, “మనం వెళ్లేది ఈ పూలేనే” అన్నాడు. సలీం. “అవును” అన్నారు శ్యామ్, శరులు.

ఎప్పుడో స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వాడిపై పన్నులు నిరాకరిస్తూ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గ్రామాల్ని ఖాళీ చేయించి వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మింపజేసి, ఉద్యమించి, అన్ని రకాల పన్నుల్ని చెల్లించకుండా గ్రామ గ్రామాల్ని కదిలించాడట ఉప్పు సత్యాగ్రహంలో” అన్నాడు శర్మ… అదీ పరాయి వాడి పాలనలో, ఇప్పుడు మన స్వేచ్ఛా స్వరాజ్యంలో ప్రజలే ప్రభువులుగా వుండే ప్రజాస్వామ్య పాలనలో మన పాలకుల దౌర్జన్యం ఎలా చూడాలి?” అన్నాడు. శ్యామ్,

ముగ్గురు మాట్లాడుకొంటున్న తరుణంలో వాళ్లు వెళ్లాల్సిన ఊరి బస్సు వచ్చింది 12వ నెంబర్ ప్లాట్ఫామ్ పై. గబగబా బస్సెక్కి సీట్లలో కూర్చొని క్షణాల్లో నిద్రలోకి జారుకొన్నారు ముగ్గురు. రాత్రి షిఫ్ట్లో పని చేయడంలో అలసిన దేహాల్ని నిద్ర తన స్వాధీనంలోకి తీసుకోవాలి. నిద్ర లేండి… మీ స్టాప్ వచ్చింది అంటూ కండక్టర్ బస్ ఆపి పెద్దగా అరుస్తున్నాడు. 

శర్మా, సలీం లేవండిరా! అంటూ బ్యాగ్స్ తీసుకొని గబగబా బస్సు దిగారు. గూగుల్ మ్యాప్లో లొద్దిపల్లి స్మార్ట్ ఫోనులో సెర్చి చేస్తూ డొంకరోడ్డు వెంబడి నడకను సాగించారు శ్యామ్, శర్మ, సలీంలు. బురదనీటిలో మహిళా వ్యవసాయ కూలీల తల్లులు నడుం వంచి జానపద గీతాలు ఆలపిస్తూ నాట్లు వేస్తున్నారు.

తాడిచెట్లపై కల్లును గీస్తున్నారు గీత కార్మిక సోదరులు. దూరంగా దేవాలయం మైక్లో అంబా శాంభవి అంటూ దుర్గాదేవిపై పాట మంద్రంగా వినిపిస్తోంది. మరోవైపు నుండి అల్లా హో అక్బర్… అంటూ మసీదులో మధ్యాహ్నం నమాజ్ ఏక కంఠంతో వినిపిస్తోంది. తన్ను తాను తగ్గించుకొన్నవాడు హెచ్చింపబడును.. ప్రభువు ఏసును.. ఆయన రాకను నమ్ముడి’ అంటూ పాస్టర్ ఉపన్యాసం చర్చిలోని మైక్ ద్వారా వినిపిస్తోంది.

చర్చి బెల్స్ మోగుతున్నాయి.. వారు ఒక అర మైలులోవ్ వుంది అంటే రామ్ కెమికల్స్ కంపెనీ ముందు ఎర్ర జెండాలు చేబూని కనీస వేతనాలు, ఉద్యోగాల వర్మినెంట్ కోసం ఖాకీ దుస్తుల్లో కార్మికులు నినాధాలు చేస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ సైన్యం, నిలబడ్డారు. కార్మిక నేత ఆవేశ ప్రసంగాన్ని శర్మ తన సెల్లో మాట్ చేస్తున్నారు. భుజానికి తగిలించుకొన్న బ్యాగ్లోంచి డైరీ తీసి 1.2 మంది కార్మికులతో ఏవో ప్రశ్నలు వేస్తూ నోట్స్ రాసుకొంటున్నాడు సలీం. 

ఫ్యాక్టరీ సెక్యూరిటీ రిసెప్షన్ రూమ్. కిటికి వద్దకు వెళ్లి సెక్యూరిటీ ఆఫీసర్కు ప్రశ్నలు సంధిస్తున్నాడు శ్యామ్ తన జర్నలిస్ట్ ఐ.డి. కార్డు చూపుతూ. యాజమాన్య సంక్షేమ సంఘం ఆఫీసర్లు గో బ్యాక్… అంటూ తెల్ల అంబాసిడర్ కార్లలో అక్కడికి చేరిన కార్మిక అధికార్లపై విరుచుకుపడ్డారు కార్మికులు.. గో బ్యాక్ అంటూ నినదిస్తున్నారు.

ఏదో బెంగాలీ డాక్యుమెంటరీ చిత్రంలా వుంది రోడ్డుకు రెండు గజాల పల్లంలో టార్పాలిన్, తాటాకు, తడికెలు, ప్లాస్టిక్ కవర్లు, ఫ్లెక్సీలతో వేసుకొన్న గుడిసెల్ని

జెసిబితో జులుం చేస్తూ వారి అన్నాన్ని నేలపాలు చేస్తూ చెంబు, గిన్నెల్ని బైటికి విసురుతున్నారు. పిల్లల ఏడుపులతో, పోలీసుల లాఠీలతో సాగించే భయంకర విన్యాసాల్ని చూసారు సలీం, శర్మ. “రేయ్ శ్యామ్, నీ కెమెరా బైటికి తీయి” అన్నారు ఇద్దరూ. అక్కడ గుడిసెల్లో వున్న వారిని బలవంతంగా లారీల్లోకి ఎక్కించే పోలీసుల జులుంపై గొంతెత్తి వారు ‘జులుం నశించాలి” అని నినదిస్తున్నారు.

ఆ దుర్మార్గాన్ని అడ్డుకొంటున్న కాపలాదారు డప్పు కనకయ్య ఏసును వదలి, మిగతా వారిని ఎక్కడికో పునరావాస ప్రాంతానికి బలవంతంగా తరలించారు. “బాబూ.. తమదు?” అని ప్రశ్నించాడు. కనకయ్య “మేం జర్నలిస్టులం. పట్నం నుండి వచ్చాం” అన్నారు శ్యామ్, సలీం, పేపరోళ్లు. 

ఆళ్ల పేరు సెబితేనే ఎస్ఆర డిప్యూటీ తాసీల్దార్ వణికిపోయారు లక్ష్మమ్మా” అన్నాడు డప్పు కనకయ్య, “ఎమ్.ఎల్.ఏ. ఎమ్.పిలే మనకు వ్యతిరేకంగా వుంటే వీళ్లెంత?” అన్నాడు వడ్రంగి వీరాచారి. ఇక్కడి నుండి వెళ్లిపోండి.

మీపై కూడా బైండోవర్ కేసులు పెడతారు. ఎమ్.ఎల్.ఎ.నరేందర్ మనుషులు మిమ్మల్ని చంపేసినా చంపేస్తారు” అన్నాడు ఏసుబాబు. “మీ ఇద్దర్ని ఎందుకు వదిలేసారు?” అన్నాడు సలీం ఆశ్చర్యంగా, “నేను సర్కార్వారి విషయాలు.. చాటింపు వేస్తాను. మా ఏసుబాబు ఈ పొలం జాగాలకు కాపలాదారు. అందుకే మా జోలికి రాలేదు”.

“మీరు ఇద్దరూ ఎస్ఆర్ఎ ఆఫీసుకు వెళ్లి- ఢిల్లీ నుండి విలేకర్లు వచ్చారు. భూపోరాటం చేసేవారిని ఇంటర్వ్యూలు చేస్తూ ఫొటోలు తీస్తున్నారు. మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పండి” అన్నాడు. శాస్త్రి తన విజిటింగ్ కనకయ్యకు అందిస్తూ. “ఆళ్లు ఎవరికీ భయపడరు బాబు” అన్నాడు యేసు. ఢిల్లీ ఇంగ్లీష పత్రికలకు భయపడతారు.

మీరు వెళ్లి ఎమ్ఎ౦కు చెప్పండి” అన్నాడు సలీం. గుడిసెలో మూలుగు వినిపించడంతో ఆందోళనగా ముగ్గురూ ఆ గుడిసె దగ్గరకు వెళ్లారు. చినిగిన బట్టలతో… రక్తం మడుగులో నలభై యేండ్ల స్త్రీ రోదిస్తోంది. ముగ్గురికి ఆమె స్థితి అర్థమైంది. ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసి నీళ్లు తాగించారు. 

వారి వద్ద వున్న ఆహార పొట్లాలు ఇచ్చి తినిపించారు. “తాము వున్నాం” అనే భరోసా ఇచ్చారు సలీం, శర్మ, శ్యామ్లు. “బాబూ, నా పేరు లక్ష్మమ్మ. నా భర్త వెంకటాలు ఫ్యాక్టరీలో ఫోర్మన్ పని చేస్తున్నాడు.

నా కొడుకుకు చదువు లేకపోవడంతో బాబుగారి పాటంలో పాలేరుగా వున్నాడు. మా పక్క గుడిసెలో హసీనా – సుభానీ దంపతులు, ఆ ఎదురుగా సిమెంట్ రేకుల్లో వున్న చిన్న ఇంట్లో మేరీ టీచర్ ఆమె భర్త లాజరస్ వున్నారు.

ఇంకా కుమ్మరి రంగయ్య, కమ్మరి భూషయ్య, కాలరి ఉప్పెనయ్య, వడ్రంగి వీరాచారి, రజక ఈశ్వరమ్మ, బార్బర్ వెంకటయ్యలు వుంటున్నాం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాం. ఇంకా ఇల్లు లేని పేదలు 1600 మంది టార్పాలిన్ ఫ్లెక్సీల్లో గుడిసెలు వేసుకొని, జీవిస్తున్నారు.

సర్కార్వాళ్ల కూల్చడం, మళ్లీ గుడిసెలు వేసుకోవడం, ఎండలో, వర్షాల్లో నానా బాధలు పడుతున్నాం. మా వూళ్లో మేమే ఎలా పరాయివాళ్లం అయ్యాం?” అంది అంత నిస్సత్తువలో కూడా లక్ష్మమ్మ.

సూర్యాస్తమయం కావడం, పొలాల నుండి ఫ్యాక్టరీల నుండి పని ముగించుకొని నేలకూలిన తమ గుడిసెల్ని అత్యంత క్రోధంతో తమ చేతుల్లోని పనిముట్లతో క్షణాల్లో కూలిన గుడిసెల్లో నిలబెట్టి మా ప్రాణాలు పోయినా ‘ఈ నేల విడువం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా శపథం చేస్తూ నినాదాలు చేసారు. ప్రకృతి వీరి పట్టుదలకు హర్షించిందా. అన్నట్లుగా వర్షం ఆరంభమైంది. 

లోతట్టు ప్రాంతం కావడంతో గుడిసెల్లోకి నీరు చేరింది. పాములు, తేళ్లు, జెర్రెలు రాసాగాయి. చిమ్మచీకట్లను వున్న ఫ్యాక్టరీల్లోని కాంతి ఆ గుడిసెలపై మినుకు మినుకుమంటూ పడుతోంది. మనుషులకన్నా తాము ప్రమాదకారకులం కాము… అంటూ విష జంతువులు సైతం గుడిసెల్లోకి చేరినా ఓ మూల నక్కి వున్నాయి.

కొందరు సమీపంలోని పాత కమ్యూనిటీ హాలు వైపుకు, కొందరు పాడుబడ్డ ఆ శివాలయంలోకి చేరి తల దాచుకున్నారు. సగం కూలిన లాజరస్ షెడ్డు ఇంట్లోకి చేరారు శర్మ, సలీం. శాస్త్రీలు, “పట్నంబాబులు.. ఇక్కడ మీరు ఉండలేరు బాబు.

ఎప్పుడు గుండాలు విరుచుకుపడతారో, ఎప్పుడు రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి ఈ భూములు స్వాధీనం కోసం గుడిసెలు కూల్చుతాలో, ఎప్పుడు లారీదార్థ చేసి అరెస్టు చేస్తారో… తెలియని భయంకర పరిస్థితుల్లో వుంటున్నాం” అంది లక్ష్మమ్మ కర్మ, “ఆళ్లు పేసరోళ్లు, ఆళ్ల పేరు సిలితేనే ఎమ్, డిప్యూటీ తాసీల్దార్ వణికిపోయారు లక్ష్మమ్మా” అన్నాడు. డప్పు కనకయ్య.

“ఎమ్.ఎల్.ఏ, ఎమ్.పిలే మనకు వ్యతిరేకంగా వుంటే వీళ్లెంత?” అన్నాడు. వడ్రంగి వీరాదారి. దొరల ప్యాక్టరీల కోసం ప్రాజెక్టుల కోసం, రింగ్ రోడ్ల కోసం, కెమికల్ ఫ్యాక్టరీల కోసం, మానేరు భూములు గుంజుకొన్నారు. రైతును రోజుకూలీ చేసారు. చదువులు లేక, కొలువులు రాక మా పెద్దలకు భారం అయ్యాం” అన్నారు. కొందరు యువకులు.

వీరు మాట్లాడుతుండగానే పట్నం నుండి పెద్ద వ్యానులో సామాజిక కార్యకర్తలు గుడిసెల వాసులకు సంఘీభావంగా నిలబడేందుకు వచ్చారు. తమతో పాటు గుడిసెల్లో నివసించే వర్షం నీటిలోనే జీవిస్తూ బోనం ఎత్తి వేపచెట్టు కింద పోశమ్మకు బోనం ఎత్తారు మహిళలు. పీర్ల పండుగ కూడా రావడంతో ముస్లింలు, పీర్లను వారు చేసిన ఖీర్ ప్రసాదాన్ని తెచ్చారు.

కొందరు యువకులు పోతరాజు వేషాలో నాయకులకు ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఇదో అపూర్వ సంఘటనగా అనిపించింది శ్యామ్, సలీంలకు. కులాల్ని, ల్ని, మతాల్ని, ప్రాంతాల్ని అవలకు తోసి పేదలంతా “ఈ నేల మాది.. గుడిసెలకు పట్టాలివ్వాలి” అంటూ రణ నినాదాల్ని ముందు వరసలో నడిచే కుమ్మరి రంగయ్య, కమ్మరి భూషణం, జాలరి జానయ్య, ఉప్పెనయ్యలు ఇవ్వసాగారు.

పట్నం నుంచి వచ్చిన నాగయ్య, వీరయ్య, రాములుగార్లు మీడియా తరపున వచ్చిన శర్మ, సలాం, శ్యామ్లు పరిచయం చేసుకొన్నారు. గుడిసెల వాసులకు భరోసా ఇస్తూ ప్రసంగిస్తున్న తరుణంలో పోలీసులు ఎమ్ అ౦, కలెక్టర్లు అక్కడికి వచ్చారు.

ఈ నేలను మల్టీ నేషనల్ కంపెనీ లీజుకు తీసుకొంది, మీరు ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సిందే….. ఎప్పటికైనా” అంటూ హ్యాండ్ మైక్ చేతబుచ్చుకొని హెచ్చరిస్తున్నాడు రవిచంద్ర.

ఎక్కడో జక్కలొద్దిలో ప్రారంభమైన గుడిసెవాసుల ఇంటి జాగాకై సాగించిన ఉద్యమం వంద పోరాట కేంద్రాల్లో ఇరవై జిల్లాల్లో సాగుతోంది. జనాభిప్రాయం మీరు ఆమోదించాలి” అన్నాడు వీరయ్య. “డంపింగ్ యార్డుల్లో మురికివాడల్లో లక్షలాది మంది నివసించే దుస్థితి మీకు కనపడదా?” అన్నాడు రాములు.

“లక్షల మంది పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించాలి” అన్నాడు. నాగయ్య. “ఇంటి సౌకర్యం జీవించే హక్కులో భాగం” అంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పును గుర్తు చేసాడు రాములు. “గౌరవప్రదంగా ఇంటి సౌకర్యంతో జీవించే హక్కు పేదలకు ఉంది” అన్నారు శ్యామ్, సలీం, శాస్త్రీలు.

స్పిన్నింగ్ ఫార్మా, కన్స్ట్రక్షన్, పౌల్ట్రీ, డిస్టిలరీస్, ఆటోమొబైల్స్, షాపు ఉద్యోగులు, వలసకూలీలు “ఇది మా నేల” అని నినదించారు. 1988 కేంద్రం అగ్ని ప్రమాదాల్లో గుడిసెలు కాలిపోతే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పింది. ఎన్ఆ౦, కలెక్టర్ పి. యస్లలో రిపోర్టులు ఇచ్చినా ఈ గుడిసెవాసులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు?” అన్నాడు అధికార్లను తీవ్రంగా ప్రశ్నించే ధోరణిలో శాస్త్రి.

నాలుగు సంవత్సరాలు ఒక ప్రాంతంలో నివసించే వారిని తొలగించరాదు అని కోర్టులే చెప్పాయి. మరి మీ అధికార గణం ఈ గుడిసె వాసులపై సాగించే అరాచకం ఏమిటి?” అన్నారు సలీమ్. “ఈ గుడిసెల్లో నివసించే ఆడపడుచులపై దాడులు, లైంగిక దాడులు చేస్తే, బాధితులు ఎఫ్ఎఆర్, పిఎమ్ఐ నివేదికలు ఇచ్చి న్యాయం కోరినా, హెల్త్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఎమ్ ఆర్ ఎందుకు సాయం చేయలేదు” అంది లక్ష్మమ్మ.

ఎమ్ఎస్ఏ అనుచరుల దాడులు ఆపాలి అంది మేరీ టీచర్. పోరంబోకు, శిఖం భూములు, బంజర్లు నిరుపేదలకు ఎందుకు పంచలేదు?” అని అధికార్లను మీడియావారి సమక్షంలో అధికార్లను ప్రశ్నించారు పేదలంతా.

“ఒక్క మన రాష్ట్రంలోనే 30 లక్షల మందికి ఇళ్లు లేవు. ఏ భూమి అయితే సర్కార్తో ఆ భూమి బహుజన శ్రామిక  పి. యస్లలో రిపోర్టులు ఇచ్చినా ఈ గుడిసెవాసులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు?” అన్నాడు అధికార్లను తీవ్రంగా ప్రశ్నించే ధోరణిలో శాస్త్రి. నాలుగు సంవత్సరాలు ఒక ప్రాంతంలో నివసించే వారిని తొలగించరాదు అని కోర్టులే చెప్పాయి.

మరి మీ అధికార గణం ఈ గుడిసె వాసులపై సాగించే అరాచకం ఏమిటి?” అన్నారు సలీమ్. “ఈ గుడిసెల్లో నివసించే ఆడపడుచులపై దాడులు, లైంగిక దాడులు చేస్తే, బాధితులు ఎఫ్ఎఆర్, పిఎమ్ఐ నివేదికలు ఇచ్చి న్యాయం కోరినా, హెల్త్ సర్టిఫికెట్లు ఇచ్చినా ఎమ్ ఆర్ ఎందుకు సాయం చేయలేదు” అంది లక్ష్మమ్మ.

ఎమ్ఎస్ఏ అనుచరుల దాడులు ఆపాలి అంది మేరీ టీచర్. పోరంబోకు, శిఖం భూములు, బంజర్లు నిరుపేదలకు ఎందుకు పంచలేదు?” అని అధికార్లను మీడియావారి సమక్షంలో అధికార్లను ప్రశ్నించారు పేదలంతా. “ఒక్క మన రాష్ట్రంలోనే 30 లక్షల మందికి ఇళ్లు లేవు. ఏ భూమి అయితే సర్కార్తో ఆ భూమి బహుజన శ్రామిక

పేదలదే” అన్నాడు శాస్త్రి. 58 జి.ఓ. ప్రకారం ప్రతి గుడిసెకు పట్టాలు ఇవ్వాలి. మురికివాడల్లో నివాసముండే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాలి. 13 లక్షల పట్టాల దరఖాస్తులు ఏమైనాయి?” అన్నాడు కలెక్టర్తో నాయకుని హోదాలో ప్రశ్నిస్తూ వీరయ్య.

“బాంబే ఆవాస్, ఇందిరా ఆవాస్, ప్రధాని ఆవాస్ యోజన పథకాల కింద ఎన్ని ఇళ్లు, ఎన్ని పట్టాలు ఎంత మందికి 3 లక్షల నగదు ఇచ్చారు?” అని ప్రశ్నించాడు శ్యామ్. “దళితులకిచ్చి వాగ్దానాలు ఏమైనాయి?” అంది లక్ష్మమ్మ.

ఆరు లక్షల ఖాళీ భూములు పంచేదాకా ఈ పోరాటం ఆపం అన్నారు నాగయ్య, వీరయ్యలు. జాతీయ, అంతర్జాతీయ మీడియా’ సంస్థలకు ఈ పోరు వార్తలు పంపారు శ్యామ్, సలీం, శాస్త్రీలు. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాల పత్రికా వార్తా క్లిప్పింగ్లతో వేశారు. నేల కోసం ప్రాణాలు తెగించి పోరు సాగించే గుడిసెలపై నీలి, ఎర్ర జెండాలు కనిపించాయి. ఉద్యమం సాగుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870