వండి రాజ్యంలో గుణనిధి అనే రైతు నివశిస్తుండేవాడు. విద్యపూర్తి అ చేసుకువచ్చిన తన ఇరువురు కుమారులు వ్యవసాయం పట్ల ఆసక్తి కనపరచకపోవడం గమనించిన గుణనిధి “నాయనా మీ అమ్మతో కలసి నేను కాశీయాత్రకు వెళుతున్నాను. కాశీకిపోయినవాడు కాటికి పోయినట్లే అంటారు పెద్దలు. నేను తిరిగి రావడానికి సంవత్సర కాలానికి పైగా పడుతుంది. కనుక మీరు మన వ్యవసాయ భూమిని సమంగా పంచుకుని దున్ని చదును చేయండి. అందులో నేను దాచిన నిధి ఎవరికి లభించినా సమంగా పంచుకొండి అది మీ జీవితకాలం అంతా సుఖంగా జీవించడానికి సరిపోతుంది.

మీకు ఏదైనా సమస్య ఏర్పడితే మీ అమ్మ తమ్ముడు అయిన సుబ్బయ్య మామ సలహా తీసుకొండి’. అన్న గుణనిధి మరునాడు తన భార్యతో కాశీకి కాలినడకన బయలుదేరాడు. తమకు వ్యవసాయంపట్ల ఆసక్తి లేకున్నా తమ తండ్రి
పొలంలో నిధి దాచి ఉంచాను అని చెప్పడంతో అన్నదమ్ములు ఇరువురు వారం రోజులు కష్టపడి రెండు పర్యాయాలు పొలమంతా దున్నారు. అయినప్పటికీ వారికి పొలంలో ఎటువంటి నిధి లభించలేదు. అప్పుడు వారు నేరుగా తమ మేనమామ సుబ్బయ్యను కలిసి జరిగిన విషయం వివరించారు.
‘అల్లుళ్లు మన పొలంలో నిధి ఎక్కడికీపోదు ముందు దున్నిన పొలంలో పంట వేయండి’ అన్నాడు. ‘మామయ్య మాకు వ్యవసాయం తెలియదు” అన్నారు అన్నదమ్ములు. తను దగ్గర ఉండి తన అల్లుళ్ల చేత శెనగపంట వేయించి ఎన్ని

రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి. కలుపు ఎలా తీయించాలో చెప్పి తన ఊరికి వెళ్లాడు సుబ్బయ్య. పంట బాగా పండటంతో ధనం బాగా వచ్చింది. గుణనిధి కుమారులకు మామయ్య సలహాతో వరి పంట వేసారు అన్నదమ్ములు. పంట బాగా పండటంతో చాలాధనం వారి చేతికి అందింది. అలా అన్నదమ్ములు వ్యవసాయం చేసి ధనవంతులయ్యారు. కానీ వారు పొలం దున్నుతున్న ప్రతిసారి నిధి దొరుకుతుందని ఎదురు చూడసాగారు.

కొంతకాలానికి కాశీ వెళ్లిన తల్లి, తండ్రి తిరిగి రావడంతో అన్నదమ్ములు ఎంతో సంతోషించారు. ఒకరోజు సుబ్బయ్య మామయ్య తమ ఇంటికి రావడంతో ‘మామయ్య ఇప్పటికీ పొలమంతా మూడుసార్లు దున్ని చదును చేసాము కాని మాకు పొలంలో దాగిన నిధి కనిపించలేదే అన్నారు.పక్కున నవ్విన మామయ్య ‘అల్లుళ్లు మిమ్మల్ని శ్రమజీవులుగా మార్చడానికి నేను మీ తండ్రి ఆడిన నాటకం అది. సంవత్సరకాలంలో ఇంతధనం సంపాదించారంటే మీ జీవితకాలంలో ఎంతో సంపాదిస్తారు ఇలానే వ్యవసాయం చేసుకుని వృద్ధిలోనికి రండి’ అని ఆశీర్వదించాడు సుబ్బయ్య మామ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: