“The Story Told by a Watch: గాఢ నిద్రలో ఉన్న నేను ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను. మా వాడు అల్మారాలో ఏదో వెతుకుతూ పెద్ద శబ్దాలు(Loud noises) చేస్తున్నాడు. “ఏమి వెతుకుతున్నావురా?” అని అడిగాను మా వాడిని. వాడు జవాబు చెప్తూ “వాచీ నాన్నా, నా పాత వాచీ వెతుకుతున్నా” అన్నాడు. వీడికి చిన్నప్పటి నుంచీ వాచీలంటే మహా ఇష్టం. మేం ఎప్పుడు మాల్కి వెళ్లినా వాడు వాచీ కొనమని నన్ను తెగ ఇబ్బంది పెట్టేవాడు. వాచీలంటే(For watches) మరీ ఖరీదయినవేమీ కాదు సుమండీ… మహా ఉంటే వందో, రెండు వందల రూపాయలో ఉంటాయంతే. అదేమిటో మూడేళ్ల వయసు నుంచే వాడికి బొమ్మల కన్నా వాచీలంటే మహా పిచ్చి ఉండేది. వీడు ఆ కొత్త వాచీ పెట్టుకుని అపార్టుమెంట్లో అందరి ఇళ్లకి వెళ్లి నా కొత్త వాచీ అని చూపించేవాడు.

ఇంతలో వాడు ఒక బాక్స్ తీసి అందులో నుంచి వాచీ తీసి ఇది ఎవరిది నాన్నా? అని అడిగాడు. ఆ వాచీ చేతిలోకి తీసుకుని చూస్తే అది మా నాన్నగారి రాడో వాచ్…. దాన్ని చూడగానే నా కళ్ల ముందు ఎన్ని మధురమైన జ్ఞాపకాలు కదలాడసాగాయ అప్పుడు అర్థమైంది ఈ వాచీల పిచ్చి వీడికి మా నాన్న గారి దగ్గర నుంచే అబ్బిందని.
నేను మొదటిసారి విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు మా నాన్న గారికి ఒక వాచీ కొనాలి అనిపించింది. అది నా మొదటి బహుమానంగా ఆయన పుట్టిన రోజున ఇవ్వాలి.. అనుకున్నా. ఒక మిత్రుడితో కలిసి నేను రాడో షోరూంకి వెళ్లాను. చాలా మోడల్స్ చూసి వాటిలో ఒకటి ఎంచుకుని రేటు చూసా. ఆ రోజుల్లోనే అది అక్షరాలా పదిహేడు వేల రూపాయలు. ఆ రోజుల్లో నా సంపాదనకది కొంచం ఎక్కువే అయినా నాన్న గారికి ఒక మంచి వాచీ కొనాలన్న ఆకాంక్షతో కొనేశాను. ఇంతలో నా స్నేహితుడు దీంతోపాటు ఒక గోల్డ్ చైన్ షాప్కి వెళ్లి ఒక చైనా కూడా కొనేసాను.
నాన్నగారు చాలా నిజాయితీగా ఉండేవారు. చెప్పిన పేరుకి ప్రభుత్వంలో పనిచేసే ఎలక్ట్రిక్ ఇంజినీర్ అయినా ఆర్జన అంతంత మాత్రంగానే ఉండేది. తోటి సహచరులు అన్ని విధాలా అక్రమార్జన చేస్తుంటే ఆయన మాత్రం నిజాయితీకి ప్రతిరూపంగా ఉండేవారు. దానికి ఆయనిచ్చే ఒకే ఒక సమాధానం “ఆ పాపిష్టి సొమ్ము మనకు వద్దు. దేవుడిచ్చిన దాంతోనే సుఖంగా బతకాలి” అని. ఆయన ఆలోచనలకు సరి సమానంగా మా అమ్మగారి ఆలోచనలు.

జీవితంలో అడుగడుగునా కష్టాలు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నవారికి పిల్లలు ఎదిగి చేతికి వచ్చి ప్రయోజకులు అయితే అంతకన్నా కావాల్సి నదేముంటుంది? అందుకు గొప్ప తార్కాణం.. మా అమ్మా నాన్నలు. ఇప్పుడు నాన్న గారి వయసు ఎనభై పనే ఉంటుంది. చేతికి వాచీ లేదు, బ్రేస్లెట్ లేదు. ఎందుకు తీసేసారంటే పెట్టుకునే ఓపిక లేదురా! అంటారు.
ఆరోజు నేను డబ్బుకి వెనుకాడి ఎందుకు కొనడం? అనుకుంటే ఈ రోజు ఇన్ని మధుర స్మృతులు నాకు దక్కేవి కావు. అందుకనే పెద్దలు ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేయాలి.. అనేవారు. జీవితంలో డబ్బే ప్రధానం కాదు, విలువలు ప్రధానం అని చెప్పడానికి నాన్న గారి జీవితమే ఒక నిదర్శనం. మమ్మల్ని కూడా అలాగే పెంచారు, అలాగే జీవించమన్నారు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ వ్యక్తిత్వం కోల్పోతే తిరిగి రాదు అనేవారు. నా ప్రకారం జీవితం జట్కాబండి అయితే విలువలు ఇరుసు. మా వాడి దగ్గర నుంచి వాచీ తీసుకుని నాన్న గారికి చూపిస్తే ఆయన కంట నీరెట్టుకుని ఇక ఇప్పటి నుంచి దీనిని వీడు పెట్టుకోవాలి.. అని ఆ వాచీ వాడి చేతికి పెట్టారు.
Read also:hindi.vaatha.com