భువనగిరి రాజ్యాన్ని గుణశేఖరుడు పరిపాలిస్తుండేవాడు. అతని మంత్రి సుబుద్ధి. రాజ్యంలో ఏటా జరిగే పండుగ వేడుకలలో జరిగే పలురకాల పోటీలు నిర్వహించబడతాయి. విజేతలకు ప్రోత్సాహ బహుమతులు రాజుగారి చేతులమీదుగా ఇవ్వబడతాయి. ఆ యేడు జరిగిన చిత్రలేఖనం పోటీలలో రెండు చిత్రాలలో ఒకదానిని ఉత్తమచిత్రంగా ఎంపిక చేసే బాధ్యత మంత్రి సుబుద్ధికి అప్పగించాడు రాజు గుణశేఖరుడు. రెండు చిత్రాలను పరిశీలించిన మంత్రి సుబుద్ధి ‘ప్రభూ సంప్రదాయ నృత్యం చేస్తున్న యువతిని కడురమ్యంగా చిత్రికరించాడు చిత్రకారుడు.

ఈ చిత్రం సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వలేకపోయింది. మరో చిత్రాన్ని పరిశీలిద్దాం. ఈ చిత్ర రెండు భాగాలుగా చిత్రికరించబడింది. మొదటిభాగంలో ఒక బలమైన వ్యక్తి A కొండపై నుండి పెద్ద బండను కిందికి దొర్లిస్తున్నాడు. అదే చిత్రంలోని మరో భాగంలో, అదేబండను ఎందరో బలాఢ్యులు కలసి కిందకు వచ్చిన ఆ బండను తిరిగి
కొండపైకి ఎక్కించలేకపోతున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన సందేశం ఇమిడి ఉంది. ఎన్నో సంవత్సరాలు కష్టించి నేర్చినవిద్య, సత్ ప్రవర్తన, సమాజపరంగా తనకు ఉన్న మన్నన, మర్యాదలు ఒక్క తప్పుతో కొండపై నుండి దొర్లిన రాయిలా మారిపోతుందని కాని మరలా తిరిగి ఉన్నత శిఖరాలు అధిరోహించడం గత జీవితాన్ని తిరిగి పొందడం అసంభవం అని ఈ చిత్రం తెలియజేస్తుంది.
సృజన్మాక సందేశాన్ని ప్రజలకు అందించగలిగిన ఈ రెండో చిత్రమే ఉత్తమ చిత్రం’ అన్నాడు. అక్కడ ఉన్న ప్రజలంతా మంత్రి ఎంపికకు హర్షధ్వానాలు చేసారు. ‘భళామంత్రివర్యా! మీ ఎంపిక హర్షించదగినదే. సంప్రదాయకళల గురించి, ఆచార, వ్యవహారాల విషయాలలో ప్రజలకు మనం చెప్పవలసింది ఏమి ఉండదు. ఏకథ అయినా, ఏకవిత్వమైనా

సందేశాత్మకం కాకుంటే అది నిరర్ధకమే. కవులు, గాయకులు, చిత్రకారులు మొదలగువారంతా అజ్ఞాన అంధకారంలో ఉన్న ప్రజానీకానికి కరదీపికలుగా ఉండాలి. అప్పుడే వారి ఆశయం నెరవేరి ప్రజలకు మేలు జరుగుతుంది’ అన్నాడు రాజు గుణశేఖరుడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: