हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

Last Wish : ఆఖరి కోరిక

Abhinav
Last Wish : ఆఖరి కోరిక

నీ కోరిక ఏమిటో చెప అతను మాట్లాడలేదు.. “ఈ విషయం నీకు తెలిసిందే కదా! నీ కోరిక ఏమైనా ఉంటే చెప్పు” వారం రోజుల్లో ఉదో తీయబోతున్న నాగరాజును జైలర్ అడిగాడు.. శిక్ష ఖరారైన రెండు రోజుల నుండి సరిగా నిద్ర పోలేదు. ఓ పది నిమిషాల క్రితమే నిద్ర పట్టింది. అంతలోనే జైలర్ వచ్చి నిద్ర “నా అభిమాన నటుడు నిత్యారంజన్ను చూడాలి సర్’ ముక్తసరిగా చెప్పి పడుకున్నాడు. “అలాగే” అన్నాడు జైలర్, నేర పరిశోధన వార్తా కథనాలు రాయడంలో రాకేష్కు చాలా అనుభవం ఉంది. క్రైమ్ న్యూస్ రిపోర్టర్గా అతను రాసిన కథనాలు కేసులు పరిశోధించే సమయంలో పోలీసులకు చాలా ఆఫర్లు ఉపయోగపడ్డాయి. ఉరిశిక్ష విధించబోయే ఖైదీ చివరిసారిగా తన కుటుంబ సభ్యులనో, బంధు మిత్రులనో కలుసుకోవాలనుకుంటా డు. ఇలా అభిమాన నటుడిని చూడాలని కోరిక కోరడం రాకేష్కు విచిత్రంగా అనిపిం చింది. ఈ కేసు విషయంపై దృష్టి సారిం చాలని నిశ్చయించుకున్నాడు. తనకు తెలిసిన పోలీసు మిత్రునికి ఫోన్ చేసాడు. హైదరాబాద్ నగరానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం రామాపురం. చుట్టూ ఎత్తయిన కొండలు, ఎటు చూసినా పచ్చని వంటపొలాలు, రకరకాల పండ్ల తోటలతో చూడముచ్చటగా ఉన్న దృశ్యాలు.

ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించేంత అందమైన గ్రామమది. కారు సరాసరి కూలిపోవడానికి సిద్ధంగా వున్న ఒక పెంకు టిల్లు ముందు ఆగింది. కారును చూడగానే లోపలి నుండి నాలుగేళ్ల పిల్లాడు పరుగెత్తుకొచ్చాడు. “అమ్మా! బుయ్యి వచ్చిందే!” కారు అద్దం ముందు నుండి ఎక్కడానికి పిల్లాడు ప్రయత్నం చేస్తున్నాడు. “ఏయ్! వద్దురా” అంటూ పిల్లాడి తల్లి వచ్చి లోపలికి తీసుకెళ్లింది. పిల్లాడు “బుయ్యి… బుయ్యి” అంటూ ఏడుస్తున్నాడు. తల్లి అతడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. కారు దిగి లోపలికి వెళ్లాడు. “వసంత అంటే మీరేలా? అడిగాడు. “మీరు పోలీసులా?” ఆమె అడిగింది. చూసింది. ఏమిటన్నట్లు “ఆ పేరు తీయకండి” అంటూ వినురుగా వంటశాలలోకి వెళ్లింది. “రాణీ” అన్న పిల్లాడి పిలుపు చూసి వెనక్కి తిరిగి చూసాడు. “ఎవరండి మీరు?” వస్తూనే అడిగాడు. “మీరు మల్లేష్ గాలా?” అడిగారు. “అవును. ఇంతకీ మీరెవరు సర్” అడిగాడు “నేను రిపోర్టర్ని” చెప్పాడు రాకేష్ “ఇంకా ఏమీ కోపంగానే అంటూ పిల్లాడిని ఎత్తుకున్నాడు. మల్లేష్, “నాగరాజు గురించి ఒక విషయం తెలుసుకోవాలి” ఆసక్తిగా అడిగాడు రాకేష్. “దయచేయండి” అన్నట్లు రెండు చేతులు జోడించాడు మల్లేష్, ఎలా సర్దిచెప్పాలో అర్ధంకాక బయటికి వచ్చి కారు స్టార్ట్ చేసాడు. ఊరిబయట చెరువు గట్టుపై కారు ఆపి దిగాడు, సిగరెట్ వెలిగించాడు. 

పీకే ఆర్ స్టూడియో ముందు పోలీస్ వెహికల్ ఆగింది. నలుగురు పోలీస్ అధికారులు స్టూడియోలోకి వెళ్లాడు. “యు ఆర్ అండర్ అరెస్ట్” అన్నాడు పోలీస్ ఇన్ స్పెక్టర్. “మీ అరెస్ట్లకు భయపడే పిరికివాడిని కాను. చేయని నేరానికి నన్ను బాధ్యుడిని చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి” రాము హెచ్చరించారు. ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి రాముకు గురి పెట్టాడు. రాము మెరుపువేగంతో పోలీస్ రివాల్వర్ ఊహించని పరిణామానికి “షాక్ తిన్నాడు ఇన్స్పెక్టర్ చుట్టూ చూపారు. ఎదురుగా రాము రివాల్వర్తో రివాల్వర్తో కోపంగా చూస్తున్నాడు. వెనుక తనతో వచ్చిన పోలీసులు ప్రేక్షకుల్లా నిలబడ్డారు. కొద్దిసేపు నిశ్శబ్దం. “కట్” అన్నాడు డైరెక్టర్ అందరూ క్లాప్స్ కొట్టారు. “షాట్ బాగా వచ్చింది సర్” డైరెక్టర్ హీరో నిత్యరంజనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. “సర్, మీకోసం పోలీసులు వచ్చారు” పిఏ ప్రసాద్ వచ్చి చెప్పాడు. “నా కోసమా?” ఆశ్చర్యపోయాడు నిత్యారంజన్. “అవును సర్, మిమ్మల్ని కలవాలని చెప్పారు. షాట్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశారు” చెప్పాడు పిఏ. “సరే రమ్మను” అని రిలాక్స్ చెయి కూర్చున్నాడు నిత్యారంజన్, సెట్లోకి పోలీసు అధికారులు వచ్చారు. కుర్చీలు చూపించి స్వాగతించాడు నిర్మాత. నాగరాజు చివరి కోరిక విషయం సెట్లోని వారంతా షాక్ తిన్నాడు. “ఇలాంటి అభిమానులు కూడా ఉంటారని మేం అనుకోలేదు సర్, యు ఆర్ గ్రేట్ హీరో సర్” అంటూ పోలీసులు హీరోను ప్రశంసించారు. 

“ఆయన ఏం నేరం చేసాడు?” ప్రశ్నించాడు నిత్యారంజన్, “అత్యాచారం చేసి హత్య చేసాడు సర్” పోలీసులు చెప్పారు. “వ్వాట్..!” నమ్మలేనట్లు అన్నాడు హీరో.. సెట్లో అంతా మౌనం ఆవరించింది. కొద్దిసేపటి తర్వాత గంభీరంగా గొంతు విప్పాడు. “సర్, అతను నా అభిమాని కావచ్చు. కానీ అతను చేసింది కమించరాని నాగరాజుకు ఆస్తి లేకపోయినా ముంచి కోట్ల ఆస్తి లేకపోయినా, లక్షణమైన, అల్లుడు ఉద్యోగం ఉంది. తెలివితేటలు ఉన్నాయి. దొరికాడని పెళ్లికి ఒప్పుకున్నాడు. వెంటనే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసాడు. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం. ఆరోజు ఉదయించే సూర్యుడు ఉగ్రరూపం చార్చాడు. ఎవరూ సీతాపురం రామాపురం మధ్యన చెరువు ఉంది. చెరువులో ఒక అమ్మాయి శవమై తేలింది. ఆ అమ్మాయి సీతాపురానికి చెందిన స్వప్న, స్వప్న రమ్యకు డిగ్రీ క్లాస్మేట్. అత్యాచారం చేయబడి, చంపబడినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. స్వప్నకు కానీ, ఆమె కుటుంబానికి కానీ ఎవరు శత్రువులు లేరు. స్వప్నకు బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరని తెలిసింది. రెండు రోజులు పోలీసులు జరిపారు. ఊహించని విధంగా ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతడే నాగరాజు. సత్యారంజన్ వైపు ఆసక్తిగా ఇరు. ఎన్నో సన్నివేశాలను దైన రీతిలో చిత్రీకరించిన ఈ సన్నివేశం కొత్తగా బి. 

హీరో ఎలాంటి నిర్ణయం ఇంటాడోనని నిర్మాత అన్నాడు. హీరోకు సొసైటీలో వస్తే తన సినిమా పని యునట్లేనని లోలోపల పడుతున్నాడు. రెండు గ్రామాలు షాక్ అయ్యాయి. స్వప్నపై ఉన్న ఆకర్షణతోనే ఈ దారుణం చేసానని అంగీకరించాడు నాగరాజు, నాగరాజును పటుంబం, రమ్య అందరూ అసహ్యించుకున్నారు. స్టేషన్లు, కోర్టుకేసు పూర్తయి, తీర్పు చెప్పేనాటికి నాలుగు సంవత్సరాలు గడిచాయి. నాలుగు సంవత్సరాలలో అక్క, బావ, తల్లిదండ్రులుగానీ ఒక్కసారి కూడా నాగరాజు ను చూడడానికి రాలేదు. చెల్లా చెదురైన కలలను తలచుకుంటూ ఉరిశిక్షకు సిద్ధమ 

నిత్యారంజన్ ఫైల్ మూసేసాడు. ఒక బలహీనమైన క్షణం నిండు జీవితాన్ని ఎలా బలి తీసుకుందో నాగరాజు జీవితం నిరూపించింది. అప్రయత్నంగానే కళ్లు చెమ్మగిల్లాయి. రామాపురం చెరువు గట్టుపై దీర్ఘంగా ఆలోచిస్తున్న రాకేష్ మెదడు ఒక్క క్షణం పాదరసంలా పరిగిస్తోంది. వెంటనే కారులో భూపతి ఇంటికి బయలుచేరాడు. భూపతి భవంతిలోకి అడుగు పెట్టగానే గోడకు వేలాడదీసిన పెళ్లిపాటో కనిపించింది. రమ్య ఫొటో కావచ్చు అని ఊహించాడు. రాజ సింహాసనాన్ని తలపిుంచే కుర్చీలో రాజసంగా కూర్చున్న భూపతికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. “ఇంతకు వచ్చిన పనేంటో?” వెటకారంగా అడిగాడు. “భూపతిగారూ! నాకు రెండు విషయాలు అంతుచిక్కడం లేదు.

ఇంత ఆస్తి వున్న మీరు నాగరాజుతో పెళ్లికి ఎలా అంగీకరించారా అన్ని, ఇంకొకటి., నాగరాజు చరిత్ర మొత్తం పరిశోధన చేసిన నాకు ఈ నేరం ఎందుకు చేస్తాడా? అని” చెప్పాడు. రాకేష్, “తిన్నది అరక్కా” కోపంగా లేచాడు భూపతి. “మీరు కోప్పడకండి భూపతిగారు. నిదానంగా ఆలోచించండి” మెల్లగా చెప్పాడు రాకేష్. భూపతి కొద్దిసేపు మాట్లాడలేదు. “మీ గుండెలపై చేయి వేసి చెప్పండి. నాగరాజు తప్పు చేసాడని మీరు నమ్ముతున్నారా?” ప్రశాంతంగా అడిగాడు రాకేష్. “చూడు బాబు, ఇప్పుడు ఆలోచించే అవసరం నాకు లేదు. ఏదో మంచోడని నా బిడ్డను ఇద్దామనుకున్నా. వెధవ వాడే ఆ అమ్మాయిని చంపానని ఒప్పుకున్నాడు. నా పరువు తీసాడు. నువ్వేదో పేపరాయనవని ఈ రెండు ముచ్చట్లు మాట్లాడిన. మళ్లీ ఇటు రాకు. నా బిడ్డ పెళ్లే చేసుకోనంటే బతిమాలి ఒప్పించి ఏడాది కిందటే పెళ్లి చేసాను. నీకో దండం. ఇగ పో” మొహం మీదనే పొమ్మన్నట్లు చెప్పాడు, భూపతి. చేసేదేమీ లేక నిరాశగా వెనుదిరిగాడు రాకేష్. కారు రామాపురం దాటింది. కారు వేగం మందగించింది. రాకేష్ ఆలోచనలో మాత్రం వేగం పుంజుకుంది. గత రెండు రోజుల నుండి ఈ కేసును బాగా స్టడీ చేసాడు. మనసంతా అయోమయంగా ఉంది. నాగరాజు క్షణికావేశంలో నేరం చేసాడా? లేదా ఎవరైనా తనను కేసులో ఇరికించారా? ఒకవేళ అదే చేస్తే ఎంతో భవిష్యత్ ఉన్న అతడు నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? జవాబు తెలియని ప్రశ్నలు రాకేష్ని స్థిమితంగా ఉండనివ్వడం లేదు.

సెల్ చూసాడు. కారును వెనక్కి తిప్పి మళ్లీ రామాపురం వైపు పోనిచ్చాడు. కారు ఆగిన శబ్దం విని మల్లేష్ బయటికి వచ్చాడు. “మళ్లీ వచ్చారా?” అడిగాడు మల్లేష్, “మీరు ఒక విషయం దాచిపెడుతున్నారు. నాగరాజు ఎంతైనా మీ బావమరిది. ఒక్కసారైనా మీరు కలవలేదు. కనీసం తోడబుట్టిన వసంతగారివైనా వంపలేదు” ఎందుకన్నట్టు అడిగాడు రాకేష్. “చూడండి.. వాడి వల్ల మా పరువు పోయింది. నా ఉద్యోగం పోయింది. నాకు ఎక్కడ ఉద్యోగం దొరకడం లేదు. వారి అమ్మ, నాన్నలకు పని దొరకడం లేదు. ఉన్న ఊరిని విడిచిపెట్టలేక, పని లేక ఇలా బతుకుతున్నాం. విలేకర్లకు పోలీసులకు చెప్పిందే చెప్పి అలసిపోయాం. ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి” బతిమిలాడుతూ వేడుకున్నాడు. మల్లేష్ “ఒక్క విషయం సూటిగా అడుగుతాను. ఉండడానికి కూడా ఇల్లు సరిగా లేని మల్లేష్కు హైదరాబాద్లో కోటిన్నర రూపాయల ఇల్లు ఎలా ఉందో అర్థం కావడం లేదు” రాకేష్ మాటలు తలుపు చాటు నుండి విం టున్న వసంత ఒక్కసారిగా బయటకు వచ్చి ఆశ్చర్యంగా- “ఏంటి సార్! మీరంటున్నంది?” అంది. “మీ ఆయననే అడగండి” మల్లేష్ వైపు చూపించాడు. “అదంతా అబద్ధం” అన్నాడు మల్లేష్ పది నిమిషాల క్రితం తన సెల్కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ లు చూపించాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఆధార్ కార్డు, ఇంటి ఫొటోలు, రెంట్కు ఇచ్చిన వివరాలు చూడగానే మల్లేష్కు నోట మాట రాలేదు. వసంత మల్లేష్ కాలర్ పట్టి గట్టిగా నిలదీసింది. 

మల్లేష్ భయభయంగానే నోరు విప్పాడు. భయంకర నిజాన్ని విని వసంత తట్టుకోలేక కింద పడిపోయింది. “సర్, ఏం ఆలోచించారు?” పిఏ అడిగిన ప్రశ్నకి నిత్యారంజన్ మౌనమే సమాధానమయింది. నాగరాజు ఫైల్ చదివినప్పటి నుండి మనసంతా దిగులుగా ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా? అని మదనపడుతున్నాడు. ఇంతలో రాకేష్ వచ్చాడు. క్రైమ్ న్యూస్ రిపోర్టర్గా రాకేష్ గురించి నిత్యారంజన్ పత్రికలో చదివాడు. నాగరాజు చివరి కోరిక గురించి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి ఉంటాడని ఊహించాడు. “నమస్కారం సర్, మీతో మాట్లాడాలి” విష్ చేసి చెప్పాడు. “ఇప్పుడు నా మనసేమి బాగాలేదు. తర్వాత కలుద్దాం” అన్నాడు. నిత్యారంజన్, “మోస్ట్ అర్జెంట్ సర్” వినయంగా అడిగాడు. “నాగరాజు గురించే అని తెలుసు నిర్ణయం నేనే చెబుతాను. నువ్వు వెళ్లవచ్చు” ఇబ్బందిగా ఫీలవుతూ అన్నాడు హీరో. “నాగరాజు గురించే, కానీ మీ నిర్ణయం కోసం రాలేదు సర్” రాకేష్ మాటలు విన్న హీరో విచిత్రంగా చూసాడు. “అవును సర్. నాగరాజు నిర్దోషి. అసలు నేరస్థులను పట్టుకోవడానికి మీ సహాయం కావాలి సర్, నిత్యారంజన్ మాట్లాడలేదు. ఏసీ హాల్లో కూడా చెమటలు పట్టాయి. నాలుగు సంవత్సరాల క్రితం నాటి సంఘటన కళ్లకు కట్టినట్లు కనిపించింది. రామాపురం కొండల్లో నిత్యారంజన్ హీరోగా నటిస్తున్న సినిమా మాటింగ్ జరిగింది. 

అది చూడడానికి రామాపురం, సీతాపురం చుట్టుపక్క గ్రామాల ప్రజలు వచ్చారు. అందులో సీతాపురం స్వప్న కూడా ఉంది. తను బాగా పాటలు పాడుతుంది. షాట్ గ్యాప్లో స్వప్న డైరెక్టర్ దగ్గరికి వెళ్లి “తాను పాటలు పాడతానని, ఒక అవకాశం ఇప్పించండని” బతిమాలింది. స్వప్న అందానికి ఆకర్షితుడైన డైరెక్టర్ ఇప్పుడు బిజీగా ఉన్నానని, షూటింగ్ అయిపోయాక కలవమని చెప్పాడు. ఆ రోజు షూటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి ఎనిమిదయింది. షూటింగ్ తర్వాత అందరూ ఎవరింటికి వారు వెళ్లారు. షూటింగ్వారు రామాపురంలో ఒక గెస్ట్ హౌజ్ అద్దెకు తీసుకున్నారు. ఆ గెస్ట్ హౌజ్ చెరువుగట్టు దగ్గర ఊరికి కొంచెం దూరంగా ఉంది. స్వప్న ఇంటికి వెళ్లకుండా డైరెక్టర్ను కలవడానికి గెస్ట్ హౌజ్ దగ్గరకు వెళ్లింది. డైరెక్టర్ ఆమెతో మాట్లాడుకుంటూ చెరువు గట్టుపైకి తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. అవకాశం కోసం వచ్చిన తనకు ద్రోహం చేసిన డైరెక్టర్ విషయం ఊరందరికి చెబుతానంటూ వెళ్లబోయింది స్వప్న. డైరెక్టర్ భయపడి, స్వప్న గొంతు నులిమి చంపేశాడు. అదే సమయంలో అత్తారిల్లు సీతాపురం నుండి చెరువు గట్టుపై వస్తున్న మల్లేష్ కంట పడింది. డైరెక్టర్ భయపడి నిత్యారంజను ఫోన్ చేసాడు. నిత్యారంజన్, నిర్మాతతో కలిసి చెరువుగట్టు దగ్గరికి వెళ్లారు. అప్పటికే డైరెక్టర్ మల్లేషు ఎవరికి చెప్పొద్దని బతిమిలాడుతున్నాడు. హీరోకు నిత్యాకు పరిస్థితి తీవ్రత అర్థమైంది. 

డైరెక్టర్, నిర్మాత హీరోలను బతిమిలాడాడు నిర్మాతకు ఒక దురాలోచన వచ్చింది. రూపాయల డబ్బు ఇస్తామని, పెద్ద లాయర్ల పెట్టి జైలు నుండి విడుదల చేయిస్తామని బతిమలాడారు. కలలో కూడా అంత డబ్బు ఊహించని మల్లేష్ తన పేదరికం పోతుంది. రెండు కోట్లు డిమాండ్ చేసాడు. గెస్ట్ హౌ వెళి కోటిన్నర రూపాయల చెక్కు తీసుకు న్నాడు. తర్వాత యాభై లక్షలు హైదరాబా తీసుకోమని చెప్పారు. ఆ రోజు ఏం జరగనట్లుగా ఇంటికి వెళ్లి మరునాడు పోలీసులు ఊరంతా గాలిస్తుంటే సీతాపురం వెళ్లి “స్వపును చంపింది తాసేను నాగరాజుతో చెప్పాడు. రెండు రోజుల్లో రమ్యతో నిశ్చితార్థం. అక్క గర్భవతి, మలేష్ ఈ విషయం తెలిస్తే బతకదని తెలిసి నేరం తన మీద వేసుకు న్నాడు. పైగా ఎవరికీ చెప్పవద్దని ఒట్టు వేసుకున్నాడు. రెండు విధాలుగా లబ్ది పొంటు మల్లేష్ తెలివిగా నాగరాజును కుటుంబం కలవకుండా జాగ్రత్త పడ్డాడు. “ఇప్పుడు చెప్పండి సర్…. ఆరోజు నిర్మాత తన సినిమా ఆగిపోతుందని ఒక జీవితాన్ని బలి చేసాడు. మీరు మౌనసాక్షిలా మిగిలి పోయారు. ఇప్పుడు కూడా మీరు నాగరాజును కలవకుండా ఉంటారా?” రాకేష్ అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. తను హీరోనా, జీరోనా తేల్చుకోలేకపోతున్నాడు. “మనం నాగరాజును కాపాడాలి” అన్నాడు.

నిత్యారంజన్, “మల్లేష్ నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఆరోజు సంఘటనకు మీరు ఒక సాక్షి, మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి చాలు. అంతా నేను చూసుకుంటాను” అంటూ లేచాడు రాకేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమని పిఏకు చెప్పాడు. రాకేష్ వెళ్తుండగా హీరో పిలిచి అడిగాడు. “రాకేష్! నా విషయం నాగరాజుకు తెలిసే ఈ కోరిక..” “నో సర్, నాగరాజుకు అసలు విషయం తెలిసి ఉండకపోవచ్చు. తెలిస్తే ఇంకో లా ఉండేది. అతనికి మీరంటే చాలా ఇష్టం. అతడు మీ అభిమాని” రాకేష్ వెళ్లాడు. “తను……” నిత్యారంజన్కు మొదటిసారి తన మీద తనకు అసహ్యం వేసింది. న్యాయ నిపుణులు వేదాంతరాజు ఇంటిముందు కారాగింది. నాగరాజు పూర్వ జీవితాన్ని తిరిగి ఇవ్వలేకపోవచ్చు. అంతకంటే విలువైన ప్రాణాన్ని మాత్రం ఇప్పించగలననే ఆత్మవిశ్వాసంతో కారు దిగాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870