हिन्दी | Epaper
మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి

A Beautiful Experience : అందమైన అనుభూతి

Abhinav
A Beautiful Experience : అందమైన అనుభూతి

ఏమోయ్ వసూ! రోటరీ క్లబ్బుదాకా వెళ్లి వస్తాను” గుమ్మం బయట చెప్పులేసుకుంటూ ఒక కేకేసి స్కూటర్ తీసుకుని బయటకు వెళ్లిపోయారు శ్రీవారు. నేను రాత్రికి కావాల్సిన వంటా వార్పూ, మిగతా కార్యక్రమాలు చక్కబెట్టుకుని తీరిగ్గా రాములవారి కోవెలకు బయలుదేరాను. మా ఆయనకూ, నాకూ ఇదొక దైనందిన కార్యక్రమం అయిపోయింది. ఇద్దరం ఉద్యోగ విరమణ చేశాక అటు పల్లెటూరూ, ఇటు పట్టణం కాని ఈ ఊర్లో స్థిరపడ్డాం. దేశమంతా తిరిగాం మేం. పట్టణ జీవితమంటే మొహం మొత్తి, పల్లెటూరు వాసనలు ఇంకా పోని ఈ ఊరుని ఎంచుకుని రిటైర్మెంట్ తరువాత వచ్చిన డబ్బుతో ఇక్కడే అన్ని హంగులతో మాకిష్టమైన రీతిలో ఒక అందమైన ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. మా అబ్బాయీ, అమ్మాయీ ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు, వాళ్ల వాళ్ల కుటుంబాలతో కలిసి. ఇద్దరూ దాదాపు అక్కడే స్థిరపడిపోయారనవచ్చు. మమ్మల్ని కూడా అక్కడికే వచ్చేయమన్నారుగానీ మా ఆయన ససేమిరా అన్నారు. “ఇంకా మా కాళ్లు, చేతులూ ఆడుతూనే ఉన్నాయి. కొన్నేళ్లపాటు ఈ పుట్టిన గడ్డ మీదే ఆనందంగా గడపనీయండి. మీరే యేడాదికోసారైనా పిల్లలతో వచ్చి మాతో ఇక్కడ గడపండి” అంటూ పిల్లలిద్దరికీ నచ్చచెప్పాం. నేనూ, మా ఆయనా ఇద్దరమూ కేంద్ర ప్రభుత్వం నుంచి రిటైర్ అవడం వలన ఇద్దరి పెన్షన్లు కలిపి దాదాపు ఒక లకారం దాకా వస్తాయి. 

దానికితోడు ఆరోగ్య బీమా వంటి వసతులు కూడా ఉండడంతో ఏ చీకు చింతా లేకుండా సుఖంగా జీవించగలుగుతున్నాం. ఈ ఊరిలో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాక ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మాకొచ్చే ఆదాయంలో ఎంతో కొంత సమాజ సేవ కోసం కేటాయించాలని. అనుకున్న విధంగా సమాజ సేవ చేస్తున్న ఎన్నో ప్రసిద్ధ సంస్థలకు ఉడతాభక్తిగా మేం ఇవ్వగలిగినంత విరాళాలు ఇస్తున్నాం. అలాగే మా ఆయన స్థానిక రోటరీ క్లబ్బులో చేరి వారు చేపట్టే సంఘసేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటూ ఆ సంస్థలో ఒక కీలక వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఉదయాన్నే లేచి నలభై నిమిషాల పాటు నడక, ఆ తరువాత ఒక పావుగంట యోగాసనాలు వెయ్యడంతో మా దినచర్య ప్రారంభమవుతుంది. ఆ తరువాత కాఫీ తాగుతూ ఇద్దరమూ చెరో న్యూస్ పేపరు చదువుకుంటూ కూర్చుంటాం మరో గంటసేపు. పేపర్ చదవడం అయిపోగానే వెనక ఆయన పెరట్లో ఉన్న తోటపని చూసుకోవడం మొదలుపెడతారు. నేను వంటపనిలో నిమగ్నమైపోతాను. స్నానాలైపోగానే ఇద్దరం కలసి ఒక గంట పూజ చేసుకుంటాం. ఆ తరువాత ఆయన బయట పని వుంటే అది చేసుకుంటారు. లేదా తనకిష్టమైన సాహిత్య మథనం చేస్తుంటారు. మంచి పుస్తకాలు చదువుకుంటూనో లేదా వ్యాసాలూ గట్రా రానుకొంటూనో, నా మటుకు నేను నాకిష్టమైన సంగీత సాధన చేసుకుంటూ ఉంటాను. 

భోజనాల తరువాత కొద్దిసేపు విశ్రమించడం, మళ్లా సాయంత్రమయ్యేసరికి ఇలా బయటకు బయల్దేరడం. దాదాపు ప్రతిరోజూ ఇదే మా దినచర్య. ఈరోజు కూడా రాములవారి కోవెల చేరుకునేసరికి సంధ్యాసమయమైంది. దాదాపు ఎకరంన్నర స్థలంలో నిర్మించిన ఆలయమది. ఆలయ ప్రాంగణం చుట్టూరా పెద్ద పెద్ద చెట్లతో, ఒక పక్క, పెద్ద కొలనుతో ఆ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గుళ్లో రాములవారి దర్శనం.. చేసుకున్నాక కూచోడానికి గుడినానుకునే ఒక మండపం ఉంటుంది. అందులో ప్రతి సాయంత్రం సంగీత కచేరీలో, భక్తి ప్రవచనాలో, లేదా బృంద సంకీర్తనలో ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. దైవ దర్శనం అయ్యాక ఆ కార్యక్రమాలను చూసి ప్రసాదం. తీసుకుని ఇంటికి వెళ్లడం నాకు అలవాటు. నేను గుడికి వెళ్లేసరికి గుడి ప్రాంగణమంతా పిల్లా పాపలతో, పెద్దలతో, మహిళలతో ఎంతో సందడిగా ఉంది. నేను గుళ్లో దర్శనం చేసుకుని మండపంలో ఓ స్థంభానికానుకొని కూర్చున్నాను. ఇంకా కార్యక్రమమేది మొదలవపోవడం వలన చుట్టూరా ఉన్న మనుష్యులను చూస్తున్నాను. యథాలాపంగా ద్వజస్థంభం వైపు చూస్తే ఆ అమ్మాయి మళ్లా అక్కడే కూర్చుని కనపడింది. ఇప్పటికి దాదాపు వారం రోజుల నించి ఆ అమ్మాయిని ప్రతిరోజూ అక్కడే కూర్చుని వుండగా చూస్తున్నాను. చేరడేసి కళ్లతో, పొడవాటి జడతో సన్నగా పొడుగ్గా వుండి బంగారు వన్నెలో మెరిసిపోతూ అచ్చం బాపూ బొమ్మని జ్ఞప్తికి తెస్తుంది. 

ఒడిలో ఒక చిన్న బాబుని పెట్టుకుని దైవ ప్రార్ధన చేసుకుంటూ కూర్చుంటుంది. మధ్య, మధ్యలో ఆ అమ్మాయి పెద్ద  పిల్లలనుకుంటా.. ఒక బాబూ, పాపా వచ్చి కాసేపు అమ్మతో మాట్లాడి తిరిగి ఆడుకోటానికి కొలను దగ్గరున్న పచ్చికలోకి వెళ్లిపోతారు. ఆడుకోటానికి కొలను దగ్గరున్న వచ్చికలోకి వెళ్లిపోతారు. గుడిలో హారతి ఇవ్వగానే ప్రసాదం తీసుకుని పిల్లలతో కలిసి వెళ్లిపోతుంది. ఆ అమ్మాయి పైన నాకంతగా ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం ఆ అమ్మాయి కళ్లల్లో గూడు కట్టుకుని కనిపించే నైరాశ్యం, తను అంతేముంది. మధ్యలో కూర్చుని ఉన్నా ఆ కళ్లు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నదానిలా శూన్యంలోకి చూస్తూ ఉంటాయి. చేతులకు మట్టిగాజులు, మెళ్లో పుస్తెలతాడు తప్పితే మరే ఆభరణం లేకుండా, సాదా నేత చీర కట్టుకుని దిగాలుగా కూర్చుని అశోకవనంలో సీతమ్మ వారిని తలపుకు తెస్తుంది. ఈ వారం రోజుల్లో ఆ అమ్మాయి. ఎవరితోనూ మాట్లాడుతుండగా చూసింది. లేదు. తన లోకంలో తనుంటూ సమయమవగానే వెళ్లిపోతుంది. పిల్లలతో మాటలాడేటప్పుడు కూడా ఆ పరధ్యానం అలాగే ఉంటుంది. ఆ అమ్మాయిని మొదటిరోజు చూసినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను తనతో పరిచయం చేసుకుని, తన కష్టసుఖాలు తెలుసుకుని పాలుపంచుకోవాలి. కానీ ఏదో చెప్పలేని బిడియం ఆ అమ్మాయి ఏమైనా అనుకుంటుందేమోనని. 

అందుకే ప్రతీరోజూ ఆమెని కలవడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాను. ఈరోజు ఎలాగైనా ఆమెతో పరిచయం చేసుకోవాలనుకున్నాను. ఆమెను కలుద్దామని అటువైపు నాలుగడుగులు వేశానో లేదో నా అదృవశాత్తూ ఆ అమ్మాయి పిల్లల్లో ఒకరు విసిరిన బంతి నాకొచ్చి తగిలింది. అది చూసిన ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి క్షమాపణలు చెబుతూ పిల్లలని మందలించసాగింది “చూసుకుని బంతి విసరాలి, చూడండి అంటీకి ఎలా దెబ్బ తగిలిందో” అంటూ. నేను ఆ అమ్మాయితో “మరేం ఫరవాలేదు, నాకేమీ దెబ్బ తగల్లేదు” అంటూ మెల్లగా మాటలు కలుపుతూ వెళ్లి తన పక్కనే కూర్చున్నాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాక ఆ అమ్మాయి గురించిన వివరాలు తెలుసుకున్నాను. ఆ అమ్మాయి పేరు సునందట. భర్త ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నారట. ముగ్గురు పిల్లలు, బాబూ, పాపా స్కూలుకి వెళుతున్నారట. చంటివాడికి ఒక నెల క్రితమే సంవత్సరం నిండిందట. ఆ తరువాత ఇద్దరం ఏదో పిచ్చాపాటీ మాటలాడుతూ కూర్చున్నాం. ఆ మర్నాడు నేను గుడికి వెళ్లి ఆ అమ్మాయిని కలవగానే నవ్వు ముఖంతో నన్ను పలకరించింది. ఆ విషయం, ఈ విషయం మాటలాడుకుంటూ ఉండగానే కొద్ది, కొద్దిగా చీకట్లు ముసురుకోసా గాయి. మాటల మధ్యలో అదను చూసుకొని ఆ అమ్మాయితో అన్నాను “చూడమ్మా సునందా! నీ తల్లిలాంటి దాన్ని. నేనిట్లా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నీ కళ్లల్లో మెదులుతున్న దిగులుని చూసి అడగకుండా ఉండలేకపోతున్నాను. ఏదైనా తప్పుంటే క్షమించు. 

నువ్వు ఏమైనా కష్టాల్లో ఉన్నావా అమ్మా?” ఆ కొద్ది మాటలే ఆ అమ్మాయి కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరిగాయి. సానుభూతి కోసం ఎంతగా తపిస్తోందో ఏమో నా మాటలకు స్పందనగా చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోదించసాగింది. కొద్దిసేపటికి తనను తాను సంబాళించుకుని చెప్పింది.. తన చిన్నబాబుకి గుండె జబ్బట. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నలతగా ఉంటుంటే పట్నంలో పెద్ద డాక్టర్కి చూపెట్టారట. ఆయన అన్ని పరీక్షలూ చేసి బాబుకి గుండెలో రంధ్రముందనీ, దానిని సరిచెయ్యటానికి సర్జరీ అవసరమౌతుం దని చెప్పాడట. సర్జరీకి కనీసం ఏడెనిమిది లక్షలు కావాల్సి వస్తుందన్నాడట. సర్జరీ సర్జరీ కూడా ఒకటి రెండు నెలల్లో చేసేయాలన్నాడట. తమ పరిస్థితి చూస్తే రోజువారీ ఖర్చులకే తడుముకోవాల్సి వస్తోంది. ఇంక సర్జరీ ఖర్చు ఎక్కడ భరించగలమని వాపోయింది. అప్పటికీ ఆమె భర్త ఎన్నో చోట్ల అప్పుకి ప్రయత్నం చేశాడట కానీ ఏదీ సఫలం కాలేదట. కనీసం తెల్ల కార్డువాళ్లమైనా మాకీ దుస్థితి ఉండేది కాదని ఎంతో బాధపడింది. ఆమె పరిస్థితి చూసి నా గుండె తరుక్కుపోయింది. ఆమె ఒడిలో అమాయకంగా ఆడుకుంటున్న ఆ చిన్నారిని చూస్తుంటే మనసు చివుక్కుమంది. ఆమెను ఎలా అనునేయించాలో తెలియలేదు. మెల్లగా గుండె దిటవు చేసుకుని “అమ్మా సునందా! అన్నింటికి పైన ఆ భగవంతుడు ఉన్నాడు. ఆయనను నమ్ముకుని ధైర్యంగా ఉండు. అన్నీ చర్చబడతాయి. 

నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష” అన్నాను ప్రత్యుత్తరంగా సునంద ఒక నిర్జీవమైన నవ్వు నవ్వి “నేనిప్పుడు చేస్తున్నది. చేయగలిగినంది అదే అమ్మగారూ’ అంది. ఇంటికెళ్లాక ఆ రాత్రి నాకు జాగరణే అయ్యింది. మనసు మనసులో లేకుండా పోయింది. కళ్ళు మూసుకున్నా, తెరిచినా సునంద విషణ్ణ వదనమే మనసులో మెదలసాగింది. రాత్రంతా కలత నిద్రతో గడిపి ఉదయాన్నే నిద్ర లేవగానే నా హృదయ భారాన్నంతా మా ఆయనతో పంచుకున్నాను. నేను చెప్పినదంతా విని, ఆయన “దీనికింత బాధపడాలా వసూ! రాత్రే చెబితే అప్పుడే తగిన పరిష్కారం చెప్పేవాడినిగా!” అన్నారు. “పరిష్కారమా?” ఆయనవైపు ప్రశ్నార్థకంగా చూశాను. “ఔను.. పరిష్కారమే. ఆ అమ్మాయివాళ్లకి సర్జరీ చేయించగల స్థోమత లేకపోతే మనమే ఆ సర్జరీ చేయిద్దాం” అన్నారు. “మనమా?” సందేహంగా అడిగాను. “ఔను.. మనమే. మన భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న డబ్బెలాగూ ఉంది. దాన్ని సత్కార్యానికి వినియో గిద్దాం” అన్నారు. ఆయన మాటలకి నా హృదయం పులకరించిపోయింది. నా మనసులో మాటే ఆయన నోటి వెంట వచ్చిందా అనిపించింది. మంచి పనులను చేసేటప్పుడు ఏమాత్రం జాగు చెయ్యకూడదనుకుంటూ “అయితే ఈ రోజే సునందతో మాట్లాడి ఆ డాక్టర్ గురించిన విషయాలు తెలుసుకుని వస్తాను” అన్నాను. అనుకున్నట్టే ఆ సాయంత్రం సునందతో మాట్లాడి పట్టణంలోని ఆ డాక్టర్ గురించి సమస్త సమాచారం సేకరించాను. 

మర్నాడు నేనూ, మా ఆయనా కలిసి పట్టణం వెళ్లి ఆ డాక్టర్ని కలుసుకుని సునంద కొడుకు సర్జరీని గురించి అన్ని విషయాలూ మాట్లాడాం. సర్జరీకి అవసరమైన ఖర్చంతా మేమే భరిస్తామని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీకి ఏర్పాట్లు చెయ్యమని చెప్పాం. మా ఆయన “డాక్టర్గారూ! మాదొక చిన్న విన్నపం. దయచేసి సర్జరీకి అవసరమైన ఖర్చంతా మేం భరిస్తున్నా మని ఆ బాబు కుటుంబానికిగానీ, మరెవరికీగానీ ఎటువంటి పరిస్థితుల లోనూ తెలియనివ్వవద్దు. అజ్ఞాతంగా వుండి సహాయం చెయ్యడంలోనే మారు ఎంతో తృప్తి ఉంది” అన్నారు. దానికి డాక్టర్ గారు “సార్! నేనింత వరకు గోరంత చేసి కొండంత చెప్పుకునే వాళ్లనే చూశాను. కానీ మీలాంటి పుణ్యా త్యులని చూడలేదు. మీకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది” అన్నారు. అన్ని ఏర్పాట్లు చేశాక నేను, మా ఆయన సంతృప్తిగా ఇంటికి వచ్చేశాం. మర్నాడు సాయంత్రం నేను గుడికి వెళ్లేసరికి సునంద ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. నన్ను చూడగానే పరుగెత్తుకొచ్చి “అమ్మా! మీ నోటి చలవ వలన మా కష్టాలు గట్టెక్కే రోజు వస్తోందమ్మా” అంది. నేనేమీ తెలియనట్లు ఏమయిందని అడిగాను. దానికామె “అమ్మా! ఈరోజు మా డాక్టర్ గారు అర్జంటుగా రమ్మని ఫోను చేస్తే నేను, మా ఆయనా హాస్పిటలుకి వెళ్లాం. ఆయన ఎంతో తీపికబురు అందచేసారు. ఎవరో సంపన్నుడైన వ్యక్తి ఈరోజు హాస్పిటల్కి వచ్చి వాళ్ల అమ్మగారి పేరు మీద పది లక్షలు విరాళం ఇచ్చి ఆ డబ్బుని ఏవైనా అత్యవసరమైన చికిత్సలు చేయడానికి వినియోగించమని చెప్పాడట. 

హాస్పిటల్ వాళ్లు చర్చించుకున్నాక ఆ విరాళాన్ని మా బాబు సర్జరీకి ఉపయోగిద్దామని నిర్ణయించారట. ఆ విషయం చెప్పడానికే డాక్టర్గారు మమ్మల్ని పిలిచారు” అంది. అది విని నేను “అమ్మా సునందా! చాలా సంతోషంగా ఉందమ్మా, ఇంక నువ్వేమీ దిగులు పడకు. అంతా సవ్యంగా జరిగి మీ బాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడై వస్తాడు” అన్నాను. సునంద తన ఆనందభాష్పాలు తుడుచుకుంటూ “అమ్మా! అంతా మీ కృప, ఏ శుభ ముహూర్తాన మీరు ఆ మంచి మాట అన్నారోగానీ అంతా మంచే జరుగుతోంది. మీరు బాబుని దీవించాక నాకింక ఏ భయం లేదు” అంది. మరో వారం రోజుల తరువాత డాక్టర్గారు ఫోను చేసి చెప్పేరు “బాబు సర్జరీ జయప్రదంగా జరిగిందని ఇంకో ఐదు రోజులు బాబుని హాస్పిటల్లో ఉంచుకుని ఇంటికి పంపిచేస్తామని. ఈరోజే సునందావాళ్లు ఇంటికొచ్చే రోజు. మా ఆయనతో పొద్దుటే చెప్పాను ఈ రోజు సాయంత్రం సునందా వాళ్లింటికి వెళ్లి బాబుని చూసొద్దామనీ. మధ్యాహ్నమొకసారి బయటకు వెళ్లిబాబుకి ఏదైనా మంచి డ్రెస్ కొని తెమ్మని, శ్రావణ శుక్రవారం కావటం వల్ల. పొద్దుటే లేచి తలస్నానం చేసి, వంటపనంతా పూర్తి చేసి ఆయనతో పాటు పూజల్లో కూర్చున్నాను. పూరి పూర్తి కావస్తుండగా కాలింగ్ బెల్ మోగితే ఈ సమయంలో వచ్చేవాళ్లు ఎవరబ్బా అనుకుంటూ వీధిగుమ్మం దగ్గరికి వెళ్లి తలుపు తీశాను.

చూస్తే గుమ్మానికెదురుగా సునంద, చేతిలో బాబుతో, ఆమె పక్కనే ఆమె భర్తనుకుంటా.. అతనూ, ఆమె పెద్ద పిల్లలిద్దరూ.. వాళ్ల వాలకం చూస్తే సరాసరి హాస్పిటల్నుండి మా ఇంటికే వచ్చేసినట్టున్నారు. అదే అడిగితే సునంద ఔనని తలూపింది. వెంటనే వాళ్లని గుమ్మం దగ్గరే ఆపి, ఇంట్లోకి వెళ్లి ఒక పళ్లెంలో ఎర్రనీళ్లు తీసుకొచ్చి, బాబుకి దిష్టి తీసి వాళ్లని ఇంట్లోకి ఆహ్వానించాను. వాళ్లని మా వారికి పరిచయం చేసి, కుశల ప్రశ్నలయ్యాక సునందతో “అమ్మా సునందా! ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజు. బాబు పెద్ద గండం నుంచి బయట పడ్డాడు. ఇకనుంచి మీకంతా మంచే జరుగుతుందమ్మా” అన్నాను. అంతవరకూ ఉగ్గబట్టుకుని కూర్చున్నట్టున్న సునంద నా మాటలతో ఒక్కసారి భోరుమని విలపిస్తూ బాబుని నా కాళ్ల దగ్గర పెట్టి తను వంటి నా కాళ్లు కళ్లకి అద్దుకుంది. అనుకోని ఆమె చర్యతో ఒక్కసారి అవాక్కయ్యాను. “ఛ..ఛ.. ఇదేమి పని సునందా?” అంటూ ఆమెని వారించడానికి ప్రయత్నించాను. దానికి సునంద “అమ్మా! నన్ను ఆపడానికి ప్రయత్నించ కండి. అంత గొప్ప సహాయం చేసి ఇంత నిర్వికారంగా, నిరాడంబరంగా ఎలా ఉండగలుగుతున్నారమ్మా. మనుషుల్లో వెలిసిన దేవతామూర్తులు మీరిద్దరూ. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగ లుగుతాం” అంటూ కళ్లనీరెట్టుకుంది. ఆమె కళ్లల్లో మెదులుతున్న కృతజ్ఞత, ఆరాధనా భావం చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది.

మానవ జన్మ ఎత్తాక ఇంకతన్నా సంతృప్తి ఏం కావాలి అనిపించింది. మా వారి పరిస్థితి కూడా నా లాగే ఉన్నట్టుంది. మాట మార్చడానికని సునంద భర్తని అడిగారు.. “ఈ విషయం మీకెవరు చెప్పారని?”. దానికతను హాస్పిటల్లో నర్సులెవరో ఈ విషయం మీద మాట్లాడుకుంటుంటే విని సునందకి సందేహమొచ్చి ఈరోజు వచ్చేసేటప్పుడు డాక్టర్ గారిని గట్టిగా నిలదీస్తే ఆయన గత్యంతరం లేని పరిస్థితిలో ఈ విషయం చెప్పారని చెప్పాడు. ఆ మాట విన్నాక సునందని ఇక పట్టలేకపోయాననీ, మొదట మీ దర్శనం చేసుకోనిదే ఇంటికి రానని భీష్మించుకుని కూర్చుందనీ చెప్పాడు. ఆ తరువాత సునంద, ఆమె కుటుంబం మా ఇంట్లోనే భోజనాలు చేసి వాళ్లింటికి వెళ్లిపోయారు. మా దగ్గర ఉన్నంతసేపూ వాళ్లకి మమ్మల్ని పొగడడంతోనే సరిపోయింది. 

నా మటుకు నాకు సునంద కళ్లల్లో నైరాశ్యం మాయమై ఆనందం నాట్యం చేయడం చూస్తుంటే ఎంతో తృప్తిగా, హాయిగా అనిపించింది. ఆ రాత్రి మా ఆయనతో ఆ మాటే అన్నాను “మనం ఎన్నో సేవా సంస్థలకి ఎన్నో విరాళాలు ఇచ్చాం. అవి ఎంతవరకు సద్వినియోగం అవుతు న్నాయో కూడా మనకు తెలీదు. మనమటుకు మనం సమాజానికి మనకు చేతనయినంత సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం అందించిన సహా యం ఒకరికి అంది వారి కష్టాలు కొంచెమైనా తొలగ డం ప్రత్యక్షంగా చూడడం లోగల ఆనందం, సంతృ ప్తి, అనుభూతి వేరేదేని వలన రాదు” అన్నాను. నాతో ఏకీభవిస్తూ మా ఆయన “ఔను.. సమా జానికి ఉపయోగపడే కొన్ని సహాయక చర్యలు ఏ ఒకరో, ఇద్దరో చేపట్టడం కుదరదు. అటువంటి వాటిని విరాళాలు ఇచ్చి పెద్ద, పెద్ద సంస్థల ద్వారానే సాధించగలుగుతాం. అయితే కొన్ని సహాయాలు మనంతట మనమే చేయవచ్చు. ఇకమీదట అటువంటి కార్యక్రమాలను సాధ్యమైనం తవరకు మనంతట మనమే అర్హులైన వారిని గుర్తిస్తూ అవసరమైన సహాయా న్ని గోప్యంగా అందజేద్దాం” అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:






గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870