ఇజ్రాయెల్, ఇరాన్(Israel-Iran) మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. టెహ్రాన్(Tehran)పై దాడి చేసేందుకు అమెరికా(America) సిద్ధమవుతోంది. అదే సమయంలో ఇరాన్ ప్రజలు స్ట్రాంగ్‌గా ఉండాలని ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పిలుపునిచ్చారు. శత్రువుల నుంచి వచ్చే బెదిరింపులకు వ్యతిరేకంగా బలంగా నిలబడాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “శత్రువు మీరు వారికి భయపడుతున్నారని గ్రహించినట్లయితే, వారు మిమ్మల్ని వదిలిపెట్టరని నేను మన ప్రియమైన దేశానికి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు వరకు మీరు కలిగి ఉన్న ప్రవర్తనను కొనసాగించండి. ఈ ప్రవర్తనను శక్తితో కొనసాగించండి. స్ట్రాంగ్‌గా ఉండండి అన్నారు ఖమేనీ.

అంతకుముందు బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలను ఖమేనీ తీవ్రంగా తిరస్కరించారు. ఇరాన్‌తో ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనికంగా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎందుకంటే ఇరాన్ దేశాన్ని లొంగిపోదని తెలిపారు. ఇరాన్ చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు బెదిరింపు భాషలో మాట్లాడరని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు..
“ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రవేశిస్తే 100 శాతం దానికే హానికరం. ఇరాన్‌కు ఏదైనా హాని తలపెడితే, దాని కంటే ఎక్కువ నష్టం అమెరికాకే కలుగుతుంది. అమెరికా అధ్యక్షుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. తన అసంబద్ధమైన వాక్చాతుర్యంతో, ఇరాన్ ప్రజలు తనకు లొంగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. బయపడేవారిపై బెదిరింపులకు దిగవచ్చు. కానీ ఇరాన్ అలాంటి బెదిరింపులకు ఎప్పటికీ లొంగిపోదు” అని తెలిపారు. మరోవైపు, టెహ్రాన్ అణుకార్యక్రమాన్ని బూచిగా చూపి ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని ఇటీవల రష్యా తెలిపింది, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది.
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం తగదు
“అమెరికాకు ఓ హెచ్చరిక చేయాలనుకుంటున్నాం. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం తగదు. ప్రస్తుత పరిస్థిత్తుల్లో ఇది అత్యంత ప్రమాదకరం” అని మారియా తెలిపారు. మరోవైపు ఇరాన్‌లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడిపైనా రష్యా స్పందించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అమెరికా తాము తీసుకునే నిర్ణయాన్ని సిద్ధం చేసుకుంటోంది. రెండు వారాల వ్యవధిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యపై నిర్ణయం తీసుకోనున్నారు.
Read Also: srael-Iran Crisis: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?