ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) తాలూకూ హామీలు నెరవేరడం మొదలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తొలి పథకానికి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి ‘తల్లికి వందనం‘ (Salute to mother) పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు.ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు నేరుగా డబ్బు జమ అవుతుంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలైనా అందరికీ ఈ సాయం వర్తిస్తుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.27 లక్షల విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది. ప్రభుత్వం దీని కోసం రూ.10,091 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి కేటాయించారు.గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం కేవలం 42.61 లక్షల మందికే వర్తించింది. ఇప్పటి పథకం 24 లక్షల మందికి అదనంగా అందుతుంది. వారి బడ్జెట్ రూ.5,540 కోట్లు కాగా, చంద్రబాబు ప్రభుత్వం రూ.8,745 కోట్లు మంజూరు చేస్తోంది.
వారి కంటే రూ.3,205 కోట్లు ఎక్కువ
తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతుంది. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షకుల ఖాతాలో జమ చేస్తారు. అనాథలకు కలెక్టర్ సూచించిన వారి ఖాతాల్లో డబ్బు వస్తుంది.ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 76 వేల మందికీ ఈ పథకం వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకూ విద్యార్థులందరికి ఇది వర్తిస్తుంది. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే డబ్బు జమ అవుతుంది.
పారదర్శకత కోసం ప్రత్యేక జాబితా
గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తారు. సమస్యలు ఉన్నవారు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. తుది జాబితా 30న విడుదల చేస్తారు.ఈ పథకంలో బలహీన వర్గాల విద్యార్థులకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. సమతుల్య సమాజ నిర్మాణానికి ఇది మొదటి అడుగు అన్నారు సీఎం.చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండూ ముఖ్యమని అన్నారు. నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెడతామని తెలిపారు. మాటిచ్చినట్లే పథకాన్ని నడుపుతున్నామని చెప్పుకొచ్చారు.
Read Also : Green Gram : పెసలు స్నాక్స్‌లాగా తింటే ఎంతో మేలు..!