ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో భాగంగా, మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. ఇప్పుడు నాలుగో జట్టు ఇంకా ప్లేఆఫ్‌లోకి ప్రవేశించలేదు. దీని కోసం ముంబై ఇండియన్స్ బలమైన పోటీదారుగా పరగణించబడుతోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో ప్లేఆఫ్స్‌కు ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టులో మూడు కీలక మార్పులు కనిపించాయి. పలు కారణాలతో దూరమైన ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్, విల్ జాక్స్ స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇంగ్లాండ్ ఆటగాళ్లైన జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌లతో పాటు శ్రీలంకకు చెందిన చరిత్ అసలంకను ముంబై జట్టులోకి తీసుకున్నారు. వారిని విల్ జాక్స్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ స్థానాల్లో రీప్లేస్‌మెంట్‌గా ముంబై యాజమాన్యం పేర్కొంది.ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్లేఆఫ్స్ నుంచి వారు అందుబాటులో ఉంటారని వెల్లడించింది. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత కారణంగా ఐపీఎల్(IPL) 2025 ఒక వారం పాటు రద్దు చేయబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విదేశీ ప్లేయర్లు తమ దేశాలకు తిరిగి వెళ్లారు. కొంత మంది ఆటగాళ్లు తిరిగి వచ్చినప్పటికీ కొందరు వివిధ కారణాల వల్ల ఐపీఎల్‌కు తిరిగి రాలేకపోయారు. ఇందులో ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారే విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్‌లకు బదులుగా జానీ బెయిర్‌స్టో, చరిత్ అసలంక, రిచర్డ్ గ్లీసన్‌లను జట్టులోకి తీసుకున్నారు.
తప్పకుండా
ముంబై ఇడియన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ కోసం ఈ ముగ్గురు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లాండ్ డాషింగ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టోను జట్టులోకి తీసుకున్నారు. జానీ బెయిర్‌స్టో రూ.5.25 కోట్లతో జట్టులోకి తీసుకున్నారు. ఇది కాకుండా, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్‌ను ర్యాన్ రికెల్టన్ స్థానంలో రూ.1 కోటి ధరకు జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు, కార్బిన్ బాష్ స్థానంలో చరిత్ అసలంకను రూ.75 లక్షల ధరకు కొనుగోలు చేశారు. కాగా ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే రాబోయే 2 మ్యాచుల్లో తప్పకుండా గెలవాల్సిందే.
Read Also: Rohit: సెంటిమెంట్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిత్ శర్మ