అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలసదారులపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. చట్టవిరుద్ధ నిరసనలపై కఠిన చర్యలు. విద్యార్థులు నిరసనలకు పాల్పడితే జైలుశిక్ష లేదా బహిష్కరణ తప్పదని హెచ్చరిక.
కేంద్ర ప్రభుత్వం భారతీయ విద్యార్థులు అమెరికాలో ఎదుర్కొనే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు చేసింది.

అమెరికా చట్టాలకు లోబడి ఉండాలి
విద్యార్థులు అక్కడి చట్టాలను గౌరవించి, నిబంధనలను పాటించాలని సూచించింది.
చదువుల కోసం వీసా పొందిన విద్యార్థులు ఇతర కార్యకలాపాల్లో పాల్గొనకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించింది.
విద్యార్థులకు ఎవరైనా ఇబ్బందులు ఎదురైతే?
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, భారత రాయబారి కార్యాలయాలు సహాయపడతాయి.
విదేశాంగ శాఖ కార్యదర్శి సూచనలు
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ కూడా విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతిఒక్కరూ ఆయా దేశాల చట్టాలను గౌరవించాలి, విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు మన చట్టాలను పాటించాల్సిన అవసరం ఉన్నట్టుగానే, మన విద్యార్థులు కూడా అమెరికా నిబంధనలను గౌరవించాలి. విద్యార్థులు తమ చదువులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి, అమెరికా చట్టాలను గౌరవించి మెలగాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా భారత ప్రభుత్వ సంస్థలు సహాయంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.