Tenth paper leaked in Nalgonda district!

Paper leak : నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ !

Paper leak: పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. లీకై న ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టడంతో యువకులు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను టెస్ట్‌పేపర్‌లోని నుంచి చించి వాటిని ఒకే పేపర్‌లో వచ్చేవిధంగా జిరాక్స్‌లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద హల్‌చల్‌ చేశారు. టెన్త్‌ తెలుగు పేపర్‌ లీకై న విషయం శాలిగౌరారంలో వెలుగులోకి రావడంతో అధికారులు మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై గోప్యంగా విచారణ జరిపారు.

Advertisements
  నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు

మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తహశీసీల్దార్‌ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు చేరుకొని విచారణ జరిపారు. అనంతరం నకిరేకల్‌కు చేరుకొని నకిరేకల్‌లోని గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓతో పాటు డీఈఓ భిక్షపతి, తహసీల్దార్‌ జమురుద్దీన్‌, ఎంఈఓ నాగయ్య విచారణ జరిపారు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పరీక్ష కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు ఇనిజిలెటర్లను విధుల్లోనుంచి రిలీవ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు, సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చీఫ్‌ సూపరింటెండెంట్‌ను, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ను పరీక్ష విధుల నుంచి తొలగించింది. ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

Related Posts
Tamil Nadu Chief Annamalai : విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు
Tamil Nadu Chief Annamalai విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు

Tamil Nadu Chief Annamalai : విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు ఇదిగో, నూతన రాజకీయ నాయకుడు విజయ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఘాటైన Read more

కేసీఆర్‌కి సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy challenged KCR

సర్వే ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలి హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ Read more

వంట నూనెల ధరలకు చెక్: నిర్మలా సీతారామన్
cooking oil

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక Read more

ఏపీలో టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌
ఏపీలో టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈరోజు (సోమవారం) ఏపీలో గత నెల 3 నుండి 21 వరకు జరిగిన టెట్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×