Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసు తెరపైకి రోజుకో అంశం

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసు తెరపైకి రోజుకో అంశం

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఈ కేసును సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు.సీసీ కెమేరాల్లో రికార్డు అయిన విజువల్స్ ఈ కేసులో కీలకంగా మారాయి.బైక్ పై నుంచి పాస్టర్ ప్రవీణ్ పడిపోయినట్లు గుర్తించారు.ఆయన మరణానికి ముందు ఏం జరిగిందనేది పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.

Advertisements

కీలక ఆధారాలు

హైదరాబాద్ నుంచి బైక్ పైన ప్రవీణ్ కుమార్ బయల్దేరిన సమయం నుంచి ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం వరకు ఏం జరిగిందనేది పోలీసులు నిశితంగా సమాచారం సేకరిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలు దేరిన ప్రవీణ్ కుమార్ ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కీసర టోల్‌ప్లాజాలోకి రావడానికి ముందు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. 24వ తేదీన ప్రవీణ్‌ విజయవాడలోని గొల్లపూడి వద్ద ఉన్న పెట్రోలు బంకుకు చేరుకునే సమయానికి గాయాలు ఉన్నట్టు అక్కడ సిబ్బంది పోలీసులకు వివరించా రు.

సీసీ కెమెరా

ప్రవీణ కుమార్ కు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేసారు. జగ్గయ్యపేట వద్ద ముందుగా చిల్లకల్లు టోల్‌ప్లాజా వస్తుంది. ఇది దాటిన తర్వాత కీసర టోల్‌ప్లాజా. ప్రవీణ్‌కుమార్‌ 24వ తేదీ మధ్యాహ్నం 3.52 గంటలకు వేగంగా వస్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది.తిన్నగా వెళ్లిపోవడంతో జాతీయ రహదారికి పక్కన ఉన్న ప్రదేశంలో పడిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల ఫుటేజీలో కనిపిస్తున్నాయి.దీన్ని టోల్‌ప్లాజా సిబ్బంది సైతం ధ్రువీకరించారు. బుల్లెట్‌పై నుంచి పాస్టర్‌ పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఇది విన్న స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

ea5feafe692faa78f725b5f9a674f30a1743055583693240 original

ఎఫ్ఎస్ఎల్ నివేదిక

విజయవాడ వైపునకు వస్తున్న క్రమంలో చిల్లకల్లు టోల్‌గేట్‌ దాటిన తర్వాత ప్రవీణ్‌ అదుపుతప్పి పడిపోయి ఉండొచ్చని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. దీంతో, పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేధిక ఈ కేసులో కీలకంగా మారుతోంది.పోలీసులు ఈ కేసును పూర్తి విచారణ చేసిన తరువాత వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

సిబ్బంది

ప్లాజా సిబ్బంది దగ్గర పడిపోయిన ప్రవీణ్‌ను పైకి లేపి, బుల్లెట్‌పై కూర్చోబెట్టి నట్లు వెల్లడించారు. కీసర టోల్‌ వద్ద జరిగినట్టుగానే దీనికి ముందు మరో ప్రమాదం జరిగిందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. టోల్‌ప్లాజా, అంబులెన్స్‌ సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి ప్రవీణ్‌ కు ఏమైనా గాయాలయ్యాయా అని పరిశీలించారు. కుడి చేతిపై గాయం గీసుకున్నట్టుగా ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే చిల్లకల్లు-కీసర టోల్‌ప్లాజాల మధ్య ప్రవీణ్‌కు మరో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Related Posts
 దేవరగట్టు బన్నీ ఉత్సవం .. కర్రల సమరంలో 100 మందికి గాయాలు
bunny fest

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో భారీ కర్రల సమరం: వంద మందికి పైగా గాయాలు కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఆదివారం వేకువజామున జరిగిన బన్నీ ఉత్సవం Read more

పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత
పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత

అసభ్యకర వ్యాఖ్యలతో జైలుపాలైన నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలులో ఉన్న పోసాని ఛాతిలో నొప్పిగా Read more

సికింద్రాబాద్‌ రైళ్లలో సీరియల్‌ కిల్లర్‌.. 35 రోజుల్లో 5 హత్యలు
serial killer

గత ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని వికలాంగుల బోగీలో మహిళ హత్య కలకలం రేపింది. విచారణలో పోలీసులు ఇది పక్కా సీరియల్ కిల్లర్ పనిచేనని నిర్ధారించారు. రైళ్లలో Read more

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్
ys jagan

ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.చంద్రబాబును విమర్శిస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×