కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు

కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆదాయపన్ను చట్టంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని కొత్త టాక్స్ విధానం కింద రూ.12 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ఇన్కమ్ టాక్స్ బిల్ 2025ను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.
రేపు పార్లమెంట్ ముందుకు
ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు కింద సంక్లిష్టంగా ఉన్న పన్ను చట్టంలోని అంశాలను సరళీకృతం చేయాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పన్ను ఫైలింగ్ ప్రక్రియలో సమస్యలను తగ్గించి సులభతరం చేస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్‌లు, 536 క్లాజులు ఉన్నాయి.

Advertisements
కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు


టాక్స్ ఇయర్ రీప్లేస్
ఈక్రమంలో అసెస్మెంట్ ఇయర్ పదాన్ని టాక్స్ ఇయర్ రీప్లేస్ చేయనుందని తెలుస్తోంది. అలాగే ప్రీవియస్ ఇయర్ పదాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అనే పదంలో మార్పులు జరగనున్నాయని వెల్లడింది. పన్ను సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే 12 నెలల కాలాన్ని సూచిస్తుంది. దీనిని ఆర్థిక సంవత్సరంతో అలైన్ చేయాలని నిర్ణయించబడింది. అలాగే కొత్త ఆదాయపు పన్ను చట్టం బిల్లులో డిజిటల్ ట్రాన్సాక్షన్లు, క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచారం కూడా ఉండనుంది. అలాగే పన్ను చెల్లింపుదారుల రక్షణతో పాటు పారదర్శకతను పెంచేందుకు కీలక మార్పులు ఉండనున్నట్లు వెల్లడైంది. ప్రముఖ వార్తా సంస్థల నివేదిక ప్రకారం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించబడింది. జూలై 2024 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20 శాతానికి పెంచగా, లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును 12.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

న్యూ టాక్స్ రీజిమ్ కింద మారిన శ్లాబ్ రేట్లు

*రూ.4 లక్షల వరకు – ఎలాంటి పన్ను ఉండదు

*రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను

*రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను

*రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను

*రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను

*రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను

* రూ.24 లక్షలకు పైగా ఉన్న ఆదాయంపై 30 శాతం పన్ను విధించబడుతుంది పాత పన్ను విధానం కింద ఉద్యోగులు రూ.50 వేల వరకు ఆదాయాన్ని స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో మినహాయింపుగా పొందవచ్చు. ఈ క్రమంలో వారికి ఉన్ వాస్తవ వేతన ఆదాయం లేదా రూ.50 వేలు వీటిలో ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేసుకునేందుకు పన్ను చట్టంలో వెసులుబాటు కల్పించబడింది.

Related Posts
కులగణన రీసర్వే నేటితో లాస్ట్
Caste census survey ends to

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన రీసర్వే నేడు (ఫిబ్రవరి 28, 2025) ముగియనుంది. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ సర్వేను Read more

Pet Dog: పసిబిడ్డ ప్రాణాలను తీసిన పెంపుడు కుక్క
పసిబిడ్డ ప్రాణాలను తీసిన పెంపుడు కుక్క

శునకాలు అంటేనే విశ్వాసానికి ప్రతీకలుగా చెబుతుంటారు. ఎవరైనా ఒకసారి వాటికి కాస్త బువ్వ పెడితే చాలు.. వారి కోసం ఎంతకైనా తెగిస్తుంటాయి. ఇళ్లను, పొలాలను కాపాడడంతో పాటు Read more

బడ్జెట్లో ఉద్యోగాల ఊసేది? బ్యాంకర్స్ అసోసియేషన్ నిరాశ
budget

ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శించింది. బడ్జెట్‌లో ఉద్యోగాల విషయంలో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం వారిని నిరాశకు గురిచేసిందని సంఘం తెలిపింది. ఉద్యోగాలను సృష్టించకుండా Read more

ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలపై CM కీలక ప్రకటన
Revanth Reddy నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61కి పెంచిన గత ప్రభుత్వ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశ్యం వారి బకాయిలను ఎగ్గొట్టడమేనని ముఖ్యమంత్రి రేవంత్ Read more

Advertisements
×