ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల సమావేశం ఈ రోజు అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.అధికారులు ప్రజలకు ఆమోదయోగ్యంగా పనిచేయాలని, దర్పం ప్రదర్శించకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పాలనను మెరుగుపరచాలని సూచించారు.
తల్లికి వందనం పథకం
మే నెలలో “తల్లికి వందనం” పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు.ప్రతి తల్లి ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ. 15,000 ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అడ్మినిస్ట్రేషన్‌లో కీలక మార్పులు
చెత్త పన్ను రద్దు చేసి ప్రజల భారం తగ్గించామని అన్నారు.ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్ సి ప్రకటన చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.డిఎస్ సి నియామకాలను పకడ్బంధిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు.ఎబిసిడిఈ విధానం అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
ఇతర పథకాలు
బీసీల ఆర్థికాభివృద్ధికి గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్ అమలు చేశామని తెలిపారు.చేనేతలకు జీఎస్టీ రద్దు చేసి వారికి మేలు చేశామని చెప్పారు.సంక్షేమ పథకాలు బిచ్చగాలకు దానం చేసినట్లు కాదని, చివరి లబ్దిదారునికి కూడా సంక్షేమం అమలు జరగాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.

స్టీల్ ప్లాంట్
ప్రజలకు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలు లేకుంటే పేదరిక నిర్మూలన సాధ్యపడదని, అందుకే సంక్షేమాన్ని అభివృద్ధితో కలిపి అమలు చేస్తామని చెప్పారు.తెలుగుదేశం పార్టీ పాలనలో పింఛను రూ.400 నుంచి రూ.4000 వరకు పెంచామని, ఇది దేశంలో ఎక్కడా లేదనివెల్లడించారు.204 అన్న క్యాంటిన్లు ప్రారంభించి పేదలకు అన్నదానం అందించామని తెలిపారు.దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఒక సిలిండర్ ఉచితంగా ఇచ్చామని చెప్పారు.అమరావతి రాజధాని నిర్మాణానికి 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు.విశాఖ లేదా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే, అదే తరహాలో ల్యాండ్ పూలింగ్ మోడల్అనుసరించాలన్నారు.జాతీయ రహదారుల పనులకు రూ. 55,000 కోట్లు, రైల్వే ప్రాజెక్ట్‌లకు రూ. 75,000 కోట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు.ఇవి కేంద్ర ప్రాజెక్టులు అని, రాష్ట్రానికి సంబంధం లేదని భావించవద్దని కలెక్టర్లకు స్పష్టంగా చెప్పారు.