కీర్తి సురేష్ మహానటిమూవీలో సావిత్రిగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇక కీర్తి సురేష్ టాలీవుడ్ టాప్ హీరోల సరసన కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అప్పట్లో కీర్తి సురేష్‌ని వరుస హిట్స్ పలకరించిన ఇప్పుడు మాత్రం హిట్ దొరకడం కష్టంగా మారింది. గత కొంత కాలంగా టాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకోలేకపోతుంది. టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ కీర్తి సురేష్ కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.మొదట్లో పద్దతిగా ఉన్న కీర్తి సురేష్ ఇటీవల గ్లామర్ డోస్ కూడా పెంచింది. పెళ్లయిన తర్వాత గ్లామర్ షోలకు దూరంగా ఉంటుందని అంతా అనుకున్నారు దీనికి భిన్నంగా ముందుకంటే మరింతగా గ్లామర్ షోలు చేస్తూ రెచ్చిపోతుంది. గత సంవత్సరం అట్లీ నిర్మాణంలో విడుదలైన బేబీ జాన్ చిత్రం ద్వారా హిందీలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఆ చిత్రంతో కీర్తి బాలీవుడ్‌లో సత్తా చాటాలని అనుకుంది. కాని మూవీ పరాజయం చెందడంతో తిరిగి దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. రీసెంట్ గా కీర్తి సురేష్ మరో జాక్‌పాట్ కొట్టినట్టు తెలుస్తోంది.
ప్రీ ప్రొడక్షన్
లక్కీ బాస్కర్,సార్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నారట. సూర్యా 46వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతుండగా, ప్రస్తుతం ఈసినిమాకు సబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. 7 ఏళ్ల క్రితం సూర్య, కీర్తి సురేష్ కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా వచ్చింది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో వీరిద్దరు జంటగా నటించారు. కాని ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వచ్చిన దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ సూర్యతో కలిసి నటిస్తుంది. మరి ఈ చిత్రంతో అయిన కీర్తి సురేష్ ఫేట్ మారుతుందా చూడాలి.

హీరోయిన్
ఈ క్రమంలోనే అభిమానుల అంచనాలు నిలబెడుతూ వరస ప్రాజెక్ట్స్‌కే ఓకే చెప్తున్నారు ఈ కేరళ కుట్టి. రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాలతో త్వరలోనే రానున్నారు కీర్తి. ఈ సినిమాలెప్పుడో సైన్ చేసినవి.. వాటితో పాటు నెట్ ఫ్లిక్స్ కోసం అక్క అనే సిరీస్ చేస్తున్నారీమే.ఈ టైమ్‌లోనే ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లాడారు. డిసెంబర్‌లో పెళ్లయ్యాక కాస్త గ్యాప్ తీసుకుని తెలుగులో బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రౌడీ జనార్ధన సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక మలయాళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో టొవినో థామస్ సినిమాలోనూ హీరోయిన్‌గా ఖరారయ్యారు కీర్తి సురేష్. మొత్తానికి పెళ్లి తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి అన్ని ఇండస్ట్రీల్లోనూ మళ్లీ రచ్చ చేస్తున్నారు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.