జిల్లాల పర్యటనకు కేసీఆర్ సిద్ధం

జిల్లాల పర్యటనకు కేసీఆర్ సిద్ధం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. తన రాజకీయ ప్రణాళికలతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సమరానికి కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. రానున్న రోజుల్లో జిల్లాల పర్యటనకు కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో, ఈ రోజు కేసీఆర్ చేసే రాజకీయ ప్రకటన పైన ఆసక్తి నెలకొంది.

జిల్లాల పర్యటనకు కేసీఆర్ సిద్ధం

రంగంలోకి కేసీఆర్ ఈ రోజు బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం కానుంది. కీలక నిర్ణయాలకు ఈ సమావేశం వేదికగా నిలవనుంది. సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 24 వసంతాలు పూర్తిచేసుకోనుంది. పాతికేళ్లవేళ రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఖరారే ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనుంది. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు తో పాటు సంస్థాగత కమిటీలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కోసం నేతలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు.

కేసీఆర్ టార్గెట్ రేవంత్ పైనే!

టార్గెట్ రేవంత్ కేసీఆర్ ఫాం హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ లేదా బహిరంగ సభ నిర్వహణ విషయమై నిర్ణయం ప్రకటించే అవ కాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుండటంతో.. ఇక రేవంత్ పాలనా లోపాల పైన నిరసనలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం
కార్యాచరణ ఖరారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దామని గతంలోనే కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. ఇప్పుడు ఆ సమయం ముగియటంతో ఇక ప్రతిపక్ష పాత్ర సమర్ధవంతంగా నిర్వహించేలా కొత్త కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేలా కేసీఆర్ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఖరారు చేయనున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశం అవుతున్న కేసీఆర్ ఎలాంటి మార్గనిర్దేశం చేస్తారన్న ఆసక్తి రాజకీయంగా కొనసాగుతోంది.

Related Posts
శ్రీతేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల
Allu Arjun Sri Tej

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో Read more

ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు
SLBC టన్నెల్: 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది గల్లంతవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తొలుత వీరి ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా సాగినా, Read more

మలక్‌పేటలో కల్తీ దందా
మలక్‌పేటలో కల్తీ దందా

హైదరాబాద్‌లో హలీమ్ సీజన్‌ ప్రారంభమవడంతో వంట నూనెకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కల్తీ గాళ్లు సద్వినియోగం చేసుకుంటూ ప్రజల ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తున్నారు. బ్రాండ్‌ Read more

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Srisailam corridor

హైదరాబాద్-శ్రీశైలం రహదారి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ప్రయాణ సమయం Read more