తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని మార్చుకుని మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. గత పదేళ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది.తెలంగాణ ఉద్యమ కాలం నుండి బీఆర్ఎస్ ప్రత్యేక శైలితో ముందుకు సాగింది. ఉద్యమాన్ని నడిపిన విధానం, అనంతరం ప్రభుత్వాన్ని నిర్వహించిన తీరు ప్రత్యేకంగా నిలిచాయి. కానీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు కొత్త సందేశాలతో ముందుకొస్తున్నారు.ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు,ప్రతి ఒక్కడూ కేసీఆరేఅనే నినాదం పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం
ఎవరూ శాశ్వతంగా ఉండిపోరుపార్టీ ఫీనిక్స్‌ప్రతి ఒక్కడూ కేసీఆరే.మళ్లీ బీఆర్‌ఎస్ సింగిల్‌గానే అధికారంలోకి వస్తుందిఈ మాటలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవంతో చతికిలపడిన పార్టీని ట్రాక్‌లో పెట్టేందుకు బీఆర్ఎస్ పెద్దలు మరో సారి వినూత్నశైలిలో ముందుకెళ్తున్నారు.
టీడీపీ పై కామెంట్స్
ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని,కానీ రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.మనం తెచ్చిన తెలంగాణ.. మన పాలనలోనే బాగుంది.. మళ్లీ మనమే వస్తాం అంటూ కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు కేసీఆర్. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఫాంహౌస్‌లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు.

సీతక్క కౌంటర్
బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు కాంగ్రెస్ మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.మీ క్యాడర్‌ను ఊహాలోకంలో ఉంచండి,మీరు ఫామ్‌హౌస్‌లోనే ఉండండి,ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండండిఅంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ మాటలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
రాజకీయ సమీకరణాలు
బీఆర్ఎస్ నాయకత్వం కేడర్‌ను ప్రేరేపించేందుకు విస్తృతంగా యత్నిస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విధానాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయా అన్నది తేలాల్సి ఉంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాలు తెలంగాణ రాజకీయ రంగాన్ని ఏ మార్గంలో నడిపిస్తాయో చూడాలి.