हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

IPL 2025: ఈ రోజు మా సత్తా ఏంటో చూపించాం: కరుణ్ నాయర్

Anusha
IPL 2025: ఈ రోజు మా సత్తా ఏంటో చూపించాం: కరుణ్ నాయర్

టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్(Shubman Gill) ను ఎంచుకుంది బీసీసీఐ,ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆట‌గాళ్ల‌తో జ‌ట్టును ప్ర‌క‌టించింది.టీమిండియాకు నాల్గవ అతిపిన్న వయస్కుడిగా కెప్టెన్ అయ్యాడు. రిషబ్ పంత్(Rishabh Pant) ను వైస్ కెప్టెన్ గా నియమించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడబోయే మొదటి ద్వైపాక్షిక సిరీస్ ఇదే. 

బీసీసీఐ

ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆట‌గాళ్ల‌తో జ‌ట్టును ప్ర‌క‌టించింది.ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత టెస్ట్ టీమ్‌లో చోటు దక్కడంపై వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) సంతోషం వ్యక్తం చేశాడు. తన కష్టానికి ఫలితం దక్కిందని, గర్వంగా ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ జట్టులో కరుణ్ నాయర్‌కు కూడా చోటు దక్కింది.దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చడంతో సెలెక్టర్లు కరుణ్ నాయర్‌కు అవకాశం కల్పించారు. దాంతో 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కరుణ్ నాయర్ భారత టెస్ట్ టీమ్‌లోకి వచ్చాడు. అతను చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2017లో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ మెరుగైన ప్రదర్శన చేశాడు.

IPL 2025: ఈ రోజు మా సత్తా ఏంటో చూపించాం: కరుణ్ నాయర్
IPL 2025: ఈ రోజు మా సత్తా ఏంటో చూపించాం: కరుణ్ నాయర్

పెద్ద షాట్స్

మ్యాచ్ అనంతరం మాట్లాడిన కరుణ్ నాయర్‌ను టెస్ట్ ఎంపిక గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.’చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ విజయానికి మేం అర్హులం. మేం మా అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. కానీ ఈ రోజు మా సత్తా ఏంటో చూపించాం. నేను బంతిని బాగా కొట్టాను. చాలా పరుగులతోనే ఈ టోర్నీలో అడుగుపెట్టాను. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాను. అయితే నేను చాలా తొందరగా షాట్స్ ఆడాను. దాంతో సమయం తీసుకోని పెద్ద షాట్స్ ఆడాలని కోచ్‌లు చెప్పారు. ఈ మ్యాచ్‌లో అదే చేశాను.భారత టెస్ట్ టీమ్‌లో తిరిగి చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. నా కష్టానికి తగిన ఫలితం దక్కింది. చాలా గర్వంగా ఉంది. అదృష్టం కూడా కలిసొచ్చింది. మీ అందరికి తెలిసినట్లే నాకు కూడా టీమ్‌లో సెలెక్ట్ అయినట్లు తెలిసింది. సెలెక్టర్ల కాల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సన్నిహితుల నుంచి చాలా సందేశాలు వచ్చాయి.’అని కరుణ్ నాయర్ చెప్పుకొచ్చాడు. మూడేళ్ల క్రితం కరుణ్ నాయర్ “ప్రియమైన క్రికెట్, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు.’అని ట్వీట్ చేశాడు. తాజాగా టెస్ట్‌ టీమ్‌లో చోటు దక్కించుకోవడంతో ఈ ట్వీట్ మళ్లీ వైరల్‌గా మారింది. కరుణ్ నాయర్ పట్టుదల, కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Read Also: Shubhman Gill: శుభ్‌మన్ అద్భుతమైన క్రికెటర్:అగార్కర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870