हिन्दी | Epaper

Karun Nair: ఆ క్రికెటర్ చెప్పిన మాట నిజమయ్యేనా..కరుణ్ నాయర్ కెరీర్ పై సందిగ్దత

Anusha
Karun Nair: ఆ క్రికెటర్ చెప్పిన మాట నిజమయ్యేనా..కరుణ్ నాయర్ కెరీర్ పై సందిగ్దత

కర్ణాటకకు చెందిన టెస్టు క్రికెటర్ కరుణ్ నాయర్ మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అతను టెస్ట్ జట్టులోకి తిరిగొచ్చిన నేపథ్యంలో, తన సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అతను పంచుకున్నాడు.నాకు ఇప్పటికీ గుర్తుంది. ఓ ప్రముఖ భారత క్రికెటర్‌ రెండేళ్ల క్రితం నాకు ఫోన్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket) నుంచి రిటైర్మెంట్‌ తీసుకుని, ఆర్థికంగా భరోసా ఇచ్చే విదేశీ టీ20 లీగ్‌లలో ఆడుకోమని సూచించాడు. అతడు చెప్పినట్లు చేయడం చాలా సులువే. కానీ, నా లక్ష్యం తిరిగి భారత జట్టుకు ఆడటమే. ఆ సంఘటన జరిగి రెండేళ్లు గడిచాయి.

అద్భుతమైన ఫామ్‌

ఇప్పుడు నేను మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాను” అని కరుణ్ నాయర్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు.జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో కరుణ్ నాయర్‌ (Karun Nair) కు స్థానం లభించింది. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఇండియా ఏ జట్టు తలపడిన అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో సత్తా చాటాడు.కరుణ్ నాయర్ 2023, 2024 కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్లలో నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

Karun Nair: ఆ క్రికెటర్ చెప్పిన మాట నిజమయ్యేనా..కరుణ్ నాయర్ కెరీర్ పై సందిగ్దత
Karun Nair

ఇన్నింగ్స్‌లో

10 మ్యాచ్‌ల్లో అక్కడ ఓ చిరస్మరణీయమైన డబుల్ సెంచరీతో సహా 736 పరుగులు చేశాడు. ఇక 2024-25 రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో విదర్భకు ఆడుతూ 16 ఇన్నింగ్స్‌ల్లో 863 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలున్నాయి. విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో ఎనిమిది ఇన్నింగ్స్‌లో ఏకంగా 779 పరుగులు చేయగా, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2024-25 టీ20 టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 255 పరుగులు చేసి నిలకడైన ప్రదర్శన కనబరిచాడు.

Read Also: Sachin Tendulkar: ఇంగ్లండ్-భారత్ టెస్ట్ సిరీస్ పేరు మార్పుపై సచిన్ విజ్ఞప్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం, భారతీయుల తరలింపుపై కేంద్రం స్పందన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

ఇరాన్‌కు రష్యా పూర్తి అండ – పుతిన్ కీలక ప్రకటన

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

📢 For Advertisement Booking: 98481 12870