మహారాష్ట్రలో తాజాగా KSRTC బస్సు డ్రైవర్‌పై జరిగిన దాడికి నిరసనగా కన్నడ అనుకూల సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దింతో రేపు మార్చి 22న బెంగళూరులో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఏర్పడింది. ఈ నిరసనకు వివిధ కన్నడ సంస్థలు కూడా మద్దతు ఇవ్వడంతో పలు ప్రాంతాల్లో పాక్షిక మూసివేతలు, రవాణా అంతరాయాలు ఉండవచ్చు. ఈ బంద్ పిలుపుకు ప్రధాన కారణం బెళగావిలో జరిగిన భాషా ఘర్షణ సంఘటన. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)కి చెందిన ఒక బస్సు కండక్టర్‌పై మరాఠీ మద్దతుదారులు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనను ఖండిస్తూ కన్నడ అనుకూల కన్నడ సంస్థ కన్నడ ఒకూట ఈ బంద్ నిర్వహించనుంది. ఈ బంద్ కర్ణాటక అంతటా జరగనున్నందున బెంగళూరుతో సహా చాల ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు ప్రభావితం కావచ్చు.

కన్నడ మాట్లాడే ప్రజలకు భద్రత
అయితే ఈ ఘటన కర్ణాటక – మహారాష్ట్రల మధ్య చాలా కాలంగా ఉన్న భాష ఇంకా సరిహద్దు సమస్యను మళ్ళీ తీవ్రతరం చేసింది. ఈ సంఘటనకు వ్యతిరేకంగా కర్ణాటక అంతటా కన్నడ మద్దతుదారులు నిరసన తెలుపుతున్నారు. బెళగావిలో మరాఠీ అనుకూల గ్రూపులను నిషేధించడానికి అలాగే కన్నడ మాట్లాడే ప్రజలకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఒకుటా సహా ఇతర కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి.
అధికారిక ప్రకటన చేయని ప్రభుత్వం
బంద్ కారణంగా బెంగళూరులో స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం ఇంకా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించవచ్చు. అలాగే విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున కొన్ని చోట్ల ఎగ్జామ్ సెంటర్స్ తెరిచి ఉండే అవకాశం ఉంది. ఈ బంద్ కారణంగా బస్సులు, ఆటోలు, క్యాబ్ సర్వీసులు వంటి రవాణా సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
ఓలా, ఉబర్ టాక్సీ డ్రైవర్ల సంఘం మద్దతు
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) & బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (BMTC) ఉద్యోగులు ఈ బంద్ మద్దతు పలికారు. దింతో బస్సు సర్వీసులు నడిచే అవకాశం తక్కువ. అంతేకాదు ఓలా, ఉబర్ టాక్సీ డ్రైవర్ల సంఘం కూడా మద్దతు ఇచ్చినట్లు సమాచారం. అందువల్ల, ఈ సేవలు కూడా ప్రభావితమవుతాయి. చాలా ఆటో సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించినందున ఆటో సేవలు కూడా తగ్గుతాయి.
ఆసుపత్రులు, వైద్య సిబ్బంది సేవలు యధాతధం
ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, అత్యవసర అంబులెన్స్ సేవలు, విద్యుత్ ఇంకా నీరు వంటి ప్రాథమిక సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. చాలా వరకు రెస్టారెంట్లు, హోటళ్ళు మూసివేయబడతాయి. ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉంటాయి, కానీ ట్రాఫిక్ అంతరాయాల కారణంగా ఉద్యోగుల హాజరు తగ్గవచ్చు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాతిపదికన పనిచేయవచ్చు. బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి, కానీ సిబ్బంది లేకపోతే సేవలు ప్రభావితం కావచ్చు.