నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ యోచనను స్వాగతిస్తున్నాం అని కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్యాంక్ బండపై కాసేపటి క్రితం విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారని తెలిసింది. కానీ పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయాలి అని కవిత డిమాండ్ చేసారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగుతుంది కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న సంస్థ అని కవిత అన్నారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే దీక్ష చేసి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం అని అన్నారు.
అసెంబ్లీ పాస్ చేసిన బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి చేసారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి అని కవిత అన్నారు.

42 శాతం రిజర్వేషన్ల సాధన యుద్దం ఇక్కడ ఆగదు.. ఢిల్లీ వరకు వెళ్తుంది. కులగణన సరిగ్గా జరగలేదని అనేక మంది ఫిర్యాదులు చేశారు అని అన్నారు. తమ వివరాలు సేకరించలేదని లక్షలాది కుటుంబాలు చెబుతున్నాయి. కాబట్టి కులగణన వివరాలను గ్రామాల వారీగా బహీర్గతం చేయాలి అని కవిత డిమాండ్
ఇవన్నీ న్యాయమైన డిమాండ్లు… ప్రభుత్వం కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి అని కవిత కోరారు
READ ALSO: Job Mela : వరంగల్లో జాబ్ మేళా.. పోటెత్తిన నిరుద్యోగులు