భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్ లీడ్స్ వేదికగా సాగుతోంది. ఈ మ్యాచ్ ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది.ఈ మ్యాచ్‌లో గెలుపొందడానికి ఇంగ్లండ్ జట్టు 371 పరుగులు ఛేదించాలి. అయితే ఈ కీలక మ్యాచ్ ముగిసేలోపే ఇంగ్గండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (Joe Root) ఓ రికార్డు విషయంలో రాహుల్ ద్రవిడ్‌తో సమంగా నిలిచాడు. జో రూట్, జోష్ టంగ్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌తో జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రాహుల్ ద్రవిడ్ ప్రపంచ రికార్డును సమం చేశాడు.రాహుల్ ద్రవిడ్ తన 16 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో భారత్, ఐసీసీ తరఫున 164 మ్యాచ్‌లు ఆడి 301 ఇన్నింగ్స్‌లలో 210 క్యాచ్‌లు పూర్తి చేశాడు. కాగా జో రూట్ ఇంగ్లండ్ తరఫున 154 టెస్ట్ మ్యాచ్‌లలో 293 ఇన్నింగ్స్‌లలో 210 క్యాచ్‌లు పట్టాడు. జో రూట్ లీడ్స్ టెస్ట్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. దీనితో పాటు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు విషయంలో అలిస్టర్ కుక్ (Alister Cook) తో కూడా అతను సమంగా నిలిచాడు.
అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే
జో రూట్(ఇంగ్లండ్): 210,రాహుల్ ద్రవిడ్(భారత్): 210,మహేల జయవర్ధనే(శ్రీలంక): 205,స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా): 200,జాక్ కల్లిస్ (దక్షిణాఫ్రికా): 200.లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో జో రూట్ కేఎల్ రాహుల్ క్యాచ్ కూడా పట్టాడు. నాలుగో రోజు ఆటలోని మూడో సెషన్‌లో శార్దూల్ క్యాచ్ పట్టి, రూట్ భారత్, ఇంగ్లండ్ మధ్య ఆడిన టెస్ట్ మ్యాచ్ (Test match) లలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు విషయంలో అలిస్టర్ కుక్‌తో సమంగా నిలిచాడు. కుక్ భారత్‌కు వ్యతిరేకంగా 30 టెస్ట్ మ్యాచ్‌లలో 38 క్యాచ్‌లు పట్టాడు. రూట్ 31 మ్యాచ్‌లలో 38 క్యాచ్‌లతో అతని రికార్డును సమం చేశాడు.

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు
అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్): 38,జో రూట్ (ఇంగ్లండ్): 38,సునీల్ గవాస్కర్ (భారత్): 35,రాహుల్ ద్రవిడ్ (భారత్): 30,విరాట్ కోహ్లీ (భారత్): 25.జో రూట్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటివరకు ఆడిన 65 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో 102 క్యాచ్‌లు పూర్తి చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జో రూట్ కంటే ఎక్కువ క్యాచ్‌లు ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (Steve Smith) మాత్రమే పట్టాడు. స్మిత్ 53 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో 104 క్యాచ్‌లు పట్టాడు.
Read Also: Headingley Test : హెడింగ్లేలో పంత్ తొలి భారతీయుడిగా రికార్డు..