దేశవ్యాప్తంగా రైల్వే రీజియన్లలో ఉద్యోగ భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో 2026 ఫిబ్రవరి 11, 12న నిర్వహించబడతాయి. అభ్యర్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని RRB సూచించింది.
Read Also: TG TET 2026: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, దేశంలోని అన్ని రైల్వే జోన్లలో 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీ కోసం 2025 సెప్టెంబర్‌లో RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రాత పరీక్ష తర్వాత ఎంపిక ప్రక్రియ
రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షకు 4 రోజుల ముందు RRB విడుదల చేస్తుంది. రాత పరీక్ష అనంతరం కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షలు ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: