Jobs in CWC : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ (CWC) భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత విభాగాలలో డిగ్రీ, పీజీ, డిప్లొమా లేదా బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి).
Read Also : సింగరేణి నియామకాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు

రూ. 1.40 లక్షల వరకు వేతనం.. ఎంపిక విధానం మరియు దరఖాస్తు గడువు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన పే-స్కేల్ లభించనుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ₹29,000 – ₹93,000 వరకు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ₹40,000 – ₹1,40,000 వరకు వేతనం అందుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ మరియు సర్టిఫికేట్ల పరిశీలన (Document Verification) ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు CWC అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబర్ 15 (NOV 15) నాటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :