Itarsi Jobs: మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL) ఆధ్వర్యంలోని ఇటార్సీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఏర్పాటయ్యాయి. మొత్తం 265 కెమికల్ ప్రాసెస్ వర్కర్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Read Also:RRB Exam : రాత పరీక్షల తేదీలు ఇవే.. మరో 2 రోజుల్లోనే అడ్మిట్ కార్డులు విడుదల
అర్హత మరియు వయోపరిమితి వివరాలు
ఏఓసీపీ (AOCP) ట్రేడ్‌లో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ విధానం
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ మరియు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సాగుతుంది. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (NAC) పరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసిన పత్రాన్ని ఆఫ్‌లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు మార్చి 27వ తేదీలోపు సంబంధిత కార్యాలయానికి అందజేయాలి. మరిన్ని వివరాలకు https://ddpdoo.gov.in/career వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: