IAF: భారత వాయుసేన (Indian Air Force) గ్రూప్ ‘Y’ మెడికల్ అసిస్టెంట్ మరియు ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఈ భర్తీ నోటిఫికేషన్ ప్రకారం, వివాహిత మరియు అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందుతారు.
Read also: Bank Jobs:సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

అర్హతలు
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియేట్ లేదా B.Sc (Pharmacy) / ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేయాల్సి ఉంటుంది.
- జనరల్ అభ్యర్ధుల: 1 జనవరి 2006 నుండి 1 జనవరి 2010 మధ్య జన్మించి ఉండాలి.
- ఫార్మసిస్ట్ అవివాహిత అభ్యర్థులు: 1 జనవరి 2003 నుండి 1 జనవరి 2008 మధ్య జన్మించి ఉండాలి.
- ఫార్మసిస్ట్ వివాహిత అభ్యర్థులు: 1 జనవరి 2003 నుండి 1 జనవరి 2006 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ
అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 1, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్-2 మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ రిజల్ట్స్ నిర్ణయించబడతాయి.
వివరాలకు మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: