రెండో పెళ్లికి సిద్ధమైన జెఫ్ బెజోస్

Jeff Bejos: రెండో పెళ్లికి సిద్ధమైన జెఫ్ బెజోస్

ఇప్పటికే పెళ్లి అయి నలుగురు పిల్లలు ఉన్న ప్రపంచ రెండో ధనికుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు 61 ఏళ్ల జెఫ్ బెజోస్ రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఆరేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ఈయన.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్లల్ని కన్న లారెన్ శాంచెజ్‌ను వివాహమాడబోతున్నారు. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా ప్రారంభం అయింది, ఈ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఎక్కడ, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో మీరు చదవండి..

రెండో పెళ్లికి సిద్ధమైన జెఫ్ బెజోస్

నలుగురు పిల్లల తండ్రి
61 ఏళ్ల వయసు కల్గిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. 1964 జనవరి 12వ తేదీన జన్మించారు. అయితే 1993లో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా నలుగురు పిల్లలు కూడా పుట్టారు. 25 ఏళ్ల పాటు చాలా సంతోషంగా ఉన్న ఈ జంట.. ఎవరూ ఊహించని విధంగా 2019లో విడాకులు తీసుకుంది. ముఖ్యంగా జెఫ్ బెజోస్‌యే ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరిద్దరి విడాకులకు ముందు నుంచే అంటే 2018 నుంచే జెబోస్.. 54 ఏళ్ల మహిళా జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
స్నేహం కాస్తా ప్రేమగా..
అప్పటికే లారెన్ శాంచెజ్‌కు రెండు సార్లు వివాహం జరిగింది. ముఖ్యంగా పాట్రిక్ వైట్ సెల్ అనే వ్యక్తితో తొలిసారి పెళ్లి జరగ్గా.. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆపై అతడికి విడాకులు ఇచ్చిన ఆమె మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు టోనీ గోంజెలెజ్‌ను మళ్లీ వివాహమాడారు. వీరిద్దరికి కూడా ఓ కుమారుడు జన్మించాడు. ఆ తర్వాతే జెఫ్ బెజోస్‌తో ఈమెకు స్నేహం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది. కానీ ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు.
లారెన్ శాంచెజ్‌తో తాను డేటింగ్‌లో..
ముఖ్యంగా జెఫ్ బోజస్ తన భార్యతో 2019లో విడాకులు తీసుకొని.. ఆ తర్వాతే లారెన్ శాంచెజ్‌తో తాను డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం అందరికీ తెలియగా.. 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది జెఫ్ బెజోస్.. లారెన్‌ను ఫ్రాన్స్ వెకేషన్‌కు తీసుకెళ్లి ఓ విలాసవంతమైన నౌకలో 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.21 కోట్ల) గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి మరీ ప్రపోజ్ చేశారట. ఇందుకు సంబంధించి కూడా చాలానే వార్తలు వచ్చాయి. అయితే నిశ్చితార్థం జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతుంది. ముఖ్యంగా ఇటలీలోని వెనిస్ వేదికగా వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం.

Related Posts
భారత్ ఎక్కడ ఆడినా గెలుస్తుంది: వసీం అక్రమ్
భారత్ ఎక్కడైనా గెలుస్తుంది ! వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు

భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌లో ఆడి గెలవడం క్రికెట్ ప్రపంచంలో ప్రధాన చర్చనీయాంశమైంది. భారతదేశం పాకిస్తాన్‌లో ఆడకపోవడం కొందరికి లాభదాయకంగా అనిపించగా, మరికొందరు ఇది Read more

H1-B visa :అమెరికా దాటి వెళ్లాలనుకునే వారు ఆలోచించుకోవాలి: ఇమ్మిగ్రేషన్ అటార్నీ
H1-B visa

హెచ్-1బీ వీసాదారులు (H1-B visa), వారి భాగస్వాములు (F-1 Visa Holders), అంతర్జాతీయ విద్యార్థులు, గ్రీన్‌కార్డుదారులకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 Read more

మాజీ ప్రధాని హసీనాకు మరో షాక్

బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల అనంతరం భారతదేశంలో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఢాకా కోర్టు ఆమె ఆస్తులు, బ్యాంక్ ఖాతాల Read more

Good News : ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
good news it

ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS) ఎయిర్ న్యూజిలాండ్‌తో ఐదు సంవత్సరాల పాటు కొనసాగనున్న భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్ న్యూజిలాండ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *